హాండ్రెడ్ ప‌ర్సెంట్ గుణ‌ద‌ల ఫ్లై ఓవ‌ర్ ఏర్పాటుకి కృషి చేస్తాము

-ఎంపి కేశినేని శివ‌నాథ్
-1వ డివిజ‌న్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కి శంకుస్థాపన

విజ‌య‌వాడ : ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల ప‌రిష్క‌రించ‌టంతో పాటు, మౌళిక స‌దుపాయాల క‌ల్ప‌న‌, అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డ‌మే ల‌క్ష్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌నిచేస్తుంది. ఇందులో భాగంగా రైల్వే అధికారులతో మాట్లాడి హాండ్రెడ్ ప‌ర్సెంట్ గుణ‌ద‌ల ఫ్లై ఓవ‌ర్ నిర్మాణం జ‌రిగే విధంగా ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు తో క‌లిసి కృషి చేస్తాన‌ని ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు.

సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం 1వ డివిజ‌న్ గుణద‌ల ప్రాంతంలోని ఎస్.ఎల్.వి అమ‌రావ‌తి గ్రాండ్ రోడ్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కి శంకుస్థాపన కార్య‌క్ర‌మం శుక్ర‌వారం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా ఎంపి కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు తో క‌లిసి పాల్గొన్నారు. ఎంపి కేశినేని శివ‌న‌థ్, ఎమ్మెల్యే బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు శిల‌ప‌లకాన్ని ఆవిష్క‌రించటంతోపాటు , అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప‌నుల‌కి శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్భంగా డి.ఈ. సింధూర‌ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప‌నుల‌ను వివ‌రించారు. అలాగే ఎస్.ఎల్.వి అపార్ట్మెంట్ వాసులు స్థానిక స‌మ‌స్య‌ల‌పై ఎంపి కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే బొండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావు కి విన‌తి ప‌త్రం అంద‌జేశారు.

అనంత‌రం ఎంపి కేశినేని శివ‌నాథ్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కం అమృత 2.0 కింద జ‌రిగే ఈ ప‌నులకు స్టేట్ కాంట్రీబ్యూష‌న్ కూడా ఇచ్చి మ‌రింత వేగ‌వంతంగా జ‌రిగేందుకు కృషి చేస్తామ‌న్నారు. సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే బొండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావు ఆధ్వ‌ర్యంలో ఎన్నో అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన‌ట్లు తెలిపారు. ఇందులో భాగంగానే ఈ ప్రాంతంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కోసం 17 కిలోమీట‌ర్ల సీవెరేజ్ క‌లెక్ష‌న్ నెట్వ‌ర్క్ లైన్, 3.5 కిలో మీట‌ర్ల ఎస్.టి.పి మెయిన్ లైన్ ప‌నులు దాదాపు 33 కోట్ల రూపాయ‌లతో మొద‌లు పెట్ట‌డం జ‌రిగిందన్నారు

. గ‌త ప్ర‌భుత్వం విజ‌య‌వాడ న‌గ‌ర అభివృద్దికి ఒక రూపాయి కూడా విడుద‌ల చేయ‌లేదన్నారు. ఎన్డీయే కూట‌మి అధికారంలో కి వ‌చ్చిన నాటి నుంచి అభివృద్ది ప‌నుల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టింద‌న్నారు.. జ‌గ‌న్ స‌ర్కార్ కేంద్ర ప‌థ‌కాలకు రాష్ట్రం త‌రుఫున నుంచి త‌న వంతు సాయం అందించ‌క‌పోవ‌టంతో చాలా ప‌నులు ఆగిపోవ‌ట‌మే కాదు.. ప‌థ‌కాలు వెన‌క్కి వెళ్లిపోయాయని తెలిపారు.. విజ‌య‌వాడ న‌గ‌ర పాల‌క సంస్థ‌తో మాట్లాడి ఆగిపోయిన ప‌నుల‌ను…తిరిగి మొద‌లుపెట్టి విజ‌య‌వాడ‌ను అభివృద్ది దిశ‌గా న‌డిపిస్తామ‌న్నారు.

విజ‌య‌వాడ‌లోని అన్ని డివిజ‌న్స్ లో సీవెరేజ్, డ్రైనేజీ, మంచినీటి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించి..ఇచ్చిన మాట నిల‌బెట్టుకుంటామ‌న్నారు. వెస్ట్ర‌న్ బైపాన్ నుంచి గ‌న్న‌వ‌రం వెళ్లే ఈ ప్రాంతం రాబోయే కాలంలో చాలా కీల‌కం కానుందన్నారు. ఇన్న‌ర్ రింగ్ రోడ్ ప‌నులు కూడా త్వ‌ర‌లో ప్రారంభం కానున్నాయని….వంద‌ల అడుగుల రోడ్ తో ఈ ప్రాంతాన్నిఇన్న‌ర్ రింగ్ రోడ్ కి క‌నెక్ట్ చేయ‌నున్న‌ట్లు చెప్పారు.

అంతకు ముందు ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ తెలుగుదేశం కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వచ్చిన త‌ర్వాత రాష్ట్రంలో అభివృద్ధి ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయన్నారు.. ఏ స‌మ‌స్య వున్నా సీఎం దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయించుకోవ‌టం ఆప‌నులు శాంక్ష‌న్ చేయించుకోవ‌టం జ‌రుగుతుందని తెలిపారు..

గుణద‌ల ప్రాంతంలో ఎస్.టి.పి డ్రైనేజీ లైన్ కోసం దాదాపు రూ.33 కోట్ల రూపాయిల నిధులు మంజూరు చేసిన‌ట్లు తెలిపారు. ఎంపి కేశినేని శివ‌నాథ్ శంకు స్థాప‌న చేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ను త్వ‌ర‌లో పూర్తి చేసి ఈ ప్రాంతంలోని డ్రైనేజీ స‌మ‌స్య‌లు రాకుండా వుంటాయన్నారు. ఇటీవ‌ల న‌గ‌రాన్ని ముంచెత్తిన వ‌ర‌ద‌..భ‌విష్య‌త్తులో బుడ‌మేర వ‌ల్ల మ‌రోసారి వ‌ర‌ద‌ ప్ర‌మాదానికి గురికాకుండా ప‌టిష్ట‌ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు ఆదేశాలు జారీ చేసిన‌ట్లు చెప్పారు.

శాశ్వ‌తంగా విజ‌య‌వాడ న‌గ‌రం ముంపు బారిన ప‌డ‌కుండా చేయ‌ట‌మే రాష్ట్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యమ‌ని తెలిపారు. ఈప్రాంత అపార్ట్మెంట్ వాసులు వాట‌ర్, రోడ్లు అడిగారు. ఈ స‌మ‌స్య‌ల‌పై పుర‌పాల‌క శాఖ మంత్రి నారాయ‌ణ‌, న‌గ‌ర క‌మిష‌న‌ర్ ధ్యాన‌చంద్ర‌, ఎంపి కేశినేని శివ‌నాథ్ ఒక రివ్యూ జ‌రిపించి ఆ స‌మ‌స్య‌ల‌ను కూడా వేగవంతంగా ప‌రిష్క‌రించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటామన్నారు.

గుణద‌ల ఫ్లై ఓవ‌ర్ విస‌యానికి సంబంధించి ఫ్లై ఓవ‌ర్ శాంక్ష‌న్ అయినా టెక్నిక‌ల్ గా కొన్ని స‌మ‌స్య‌లు వున్నాయని.. ఆ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కరించేందుకు సంబంధిత శాఖ అధికారుల‌తో క‌లిసి ప‌నిచేస్తున్న‌ట్లు చెప్పారు. ఒక సంవ‌త్స‌రంలో పు గుణ‌ద‌ల ప్లైఓవ‌ర్ ను పూర్తి చేస్తామ‌ని ప్ర‌జ‌ల‌కు తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో1వ డివిజ‌న్ పార్టీ ఇన్చార్జ్ కొమ్మినేని సురేష్‌,ఎస్.ఎల్.వి గ్రాండ్ అధినేత శ్రీనివాస్ రాజు, ఎస్.ఎల్.వి అపార్ట్మెంట్స్ ప్రెసిడెంట్ నాగ‌ర‌త్నం, సెక్ర‌ట‌రీ సురేంద్ర‌,ఎన్.వెంక‌టేశ్వ‌ర‌రావు, బి.వెంక‌ట్, డి.ఈ. సింధూర‌, ఈ.ఈ ఇన్చార్జ్ ప్ర‌భాక‌ర్, ఎ.ఈ.న‌ర్మాద ల‌తో పాటు స్థానిక ఎన్టీయే కూట‌మి నాయ‌కులు త‌దిత‌రులు పాల్గొన్నారు.