ఏపీలో పాల్ అమలు శభాష్

నోబెల్ గ్రహీత మైఖేల్ క్రీమర్ ప్రశంస

అమరావతి: అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ లో పాల్ కార్యక్రమం అమలు తీరు బాగుందని యూనివర్శిటీ ఆప్ చికాగో ప్రొఫెసర్, పాల్ పరిశోధకులు, నోబెల్ గ్రహీత మైఖేల్ క్రీమర్ ప్రశంసించారు. మంగళవారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయానికి కార్యాలయానికి విచ్చేసి రాష్ట్రంలో పాల్ కార్యక్రమం అమలు తీరు గురించి చర్చించారు.

ఈ సమావేశంలో పాఠశాల విద్య కార్యదర్శి కోన. శశిధర్ సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు , సెంట్రల్ స్క్వేర్ ఫౌండేషన్ ప్రతినిధులు సంజయ్, ఐశ్వర్య, పాఠశాల విద్య ఐటీ ప్రతినిధి కిషోర్, శామో ప్రతినిధి మాధవి లత.డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాల్ అమలు, అభ్యాస ఫలితాల ప్రభావం; డెవలప్‌మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్ ద్వారా పాల్ పై పరిశోధన ఇన్‌పుట్‌లు; SALT ప్రాజెక్ట్ కింద 700 పాఠశాలల్లో పాల్ విస్తరణ; పాల్ రెమెడియేషన్‌ను క్షేత్రస్థాయిలో పొడిగించడం; వివిధ రాష్ట్రాల్లో అవలంబించిన ఉత్తమ పద్ధతులు; మూల్యాంకనం కోసం పాల్ పాఠశాలలకు క్షేత్ర సందర్శనలు వంటి అంశాలపై చర్చించారు.