భూ దోపిడీలో ఉన్న శ్రద్ధ పింఛన్ల పంపిణీలో లేదేమి?

-కుట్రలు కట్టిపెట్టి జూన్‌ 1న ఇళ్ల దగ్గరే పెన్షన్లు ఇవ్వాలి
-సమయం దగ్గర పడుతున్నా సీఎస్‌, సెర్ఫ్‌ సీఈవో నిర్లక్ష్యం
-తప్పకుండా తప్పు చేసిన అధికారులు మూల్యం చెల్లించుకుంటారు
-విశాఖ భూదోపిడీపై శ్వేతపత్రం విడుదల చేయాలి
-మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

మంగళగిరి: కుట్రలు కట్టిపెట్టి జూన్‌ 1న ఇళ్ల దగ్గరే పెన్షన్లు ఇవ్వాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రభుత్వాన్ని కోరారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జగన్నాటకంలో భాగంగా చీఫ్‌ సెక్రటరీ జవహర్‌ రెడ్డి, సెర్ఫ్‌ సీఈవో మురళీధర్‌ రెడ్డి పింఛన్‌దారులను ఇబ్బంది పెట్టారు. ఎన్నికల్లో లబ్ధికోసం టీడీపీపై బురద చల్లేందుకు యత్నించారు. జూన్‌ 1 వస్తున్నా ఇప్పటికీ పింఛన్ల పంపిణీపై ప్రభు త్వం నుంచి ఒక్క ప్రకటన లేదు. ఇకనైనా చీఫ్‌ సెక్రటరీ కుట్రలు ఆపాలి. బ్యాంకు ల్లో వేసిన డబ్బులు ఎంతమంది తీసుకున్నారు. ఎంత మంది తీసుకోలేదు. అన్ని వివరాలను బయటపెట్టాలి. చాలామంది పింఛన్‌దారుల బ్యాంక్‌ అకౌంట్లు పనిచే యక వేసిన డబ్బులు వెనక్కి వచ్చాయి. కొందరికి డబ్బులు కట్‌ అయ్యాయి. సచివాలయాల్లో ఉన్న సిబ్బందిని వాడుకుని ఒకటి రెండురోజుల్లో ప్రతి ఇంటికి వెళ్లి పింఛన్లు ఇవ్వొచ్చు. మళ్లీ ఇలా జరగకుండా చీఫ్‌ సెక్రటరీ స్వామి భక్తి కట్టి పెట్టి ఇంటి దగ్గరే పింఛన్‌ ఇచ్చేలా అధికారులను ఆదేశించాలి.

కలెక్టర్లతో ఇంతవరకు మాట్లాడకపోవడం దుర్మార్గం
పింఛన్ల పంపిణీపై ఇంతరవరకు కలెక్టర్లతో సీఎస్‌ మాట్లాడలేదు. సీబీఐ, ఈడీ కేసుల్లో జగన్‌ రెడ్డితో పాటు సెర్ఫ్‌ సీఈవో ముద్దాయిగా ఉన్నారు. అందువల్ల ఆయన కూడా స్వామి భక్తి చూపిస్తూ ఎంత దుర్మార్గం చేయాలో అంత దుర్మార్గం చేశారు. అధికారుల తప్పులన్నీ సమీక్షిస్తాం. తప్పు చేసిన అధికారులు తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు. వెంటనే చీఫ్‌ సెక్రటరీ అధికారులను ఆదేశించి జూన్‌ 1నే పెన్షన్‌దారులకు పింఛన్‌ ఇచ్చేలా చూడాలి.

భూ దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేయాలి
పేదల భూములు దోచుకోవడంలో సీఎస్‌ బీజీగా ఉన్నారు తప్ప పేదల పింఛన్ల పంపిణీపై కాదని అర్థం అవుతుంది. భోగాపురంలో పేదల భూములు కొట్టేసేందు కు జవహర్‌రెడ్డి, జగన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి కుటుంబసభ్యులు యత్నిస్తున్నారు. దాదాపు రూ.2 వేల కోట్ల విలువ చేసే భూములు కాజేసేందుకు కుట్రపన్నినట్లు వస్తున్న వార్తలపై సీఎస్‌ వైట్‌ పేపర్‌ రిలీజ్‌ చేయాలి. భోగాపురం పనుల పేరుతో దోచుకున్న భూములకు రిజిస్ట్రేషన్‌ను వేగవంతం చేసేందుకే అక్క డి వెళ్లారని అక్కడి జనసేన కార్పొరేటర్‌ బట్టబయలు చేస్తే అతనికి నోటీసులు ఇస్తామనడం సబబు కాదు. ఆరోపణలు వచ్చినప్పుడు నిరూపించుకోవాలి. వాస్తవా లు భయపెట్టాలని కోరారు.