ఏం జరుగుతోంది?

కొత్తగా కొలువుతీరిన కూటమి సర్కారు, ఎవరు అస్మదీయులో ఎవరు తస్మదీయులో తెలుసుకోలేక తికమక పడుతోంది.ఫలితంగా గత ఐదేళ్ల జగన్‌ రెడ్డి పాలనలో జగన్‌ విధేయ అధికారులుగా పనిచేసిన వారంతా, తిరిగి దొడ్డిదారిన మెయిన్‌ లైన్‌లోకి వస్తుండటం.. కూటమి కార్యకర్తలను ఆగ్రహ పరుస్తోంది. ఇటీవల సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి గోపాలకృష్ణ ద్వివేది, ఆ తర్వాత తుళ్లూరు సిఐ శ్రీనివాసరావు నియామకాలు కార్యకర్తల కన్నెర్రకు గురి చేశాయి. తాజాగా సీఎంవో కార్యదర్శి ప్రద్యుమ్న.. వైసిపిలో కీలకంగా పనిచేసిన న్యాయవాది అమర్నాథ్‌ రెడ్డికి, తిరుపతి లేఖ సిఫార్సు చేయడం సోషల్‌ మీడియాలో హల్చల్‌ చేస్తుంది. వైసిపి సర్కారులో కీలక పాత్ర పోషించిన న్యాయవాదికి సీఎంవో కార్యదర్శి ఏ విధంగా తిరుపతి లెటర్‌ ఇస్తారని టిడిపి కార్యకర్తలు, సోషల్‌ మీడియాలో నిలదీస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.