లోకేష్ ఎం చేస్తున్నాడు? రెడ్ బుక్ ఏమైంది?

బెయిల్ కూడా లేకుండా నెల్లూరు జిల్లా జైల్లో మగ్గుతున్న పిల్లిని అడిగితే చెప్తాడు..

60 రోజులుగా పరారీలో ఉంటూ రోజుకో చోటు మారుతూ రోడ్డు ప్రక్కన డాబా హోటళ్లలో నులకమంచాలా మీద పడుకుంటూ తప్పించుకుతిరుగుతున్న వాళ్ళ తమ్ముడు ఇంకా బాగా చెప్తాడు లోకేష్ ఎం చేస్తున్నాడో..

ఇంటికి మీదకి వచ్చిన జోగి చెప్తాడు నైట్ నిద్ర పోయాడో లేదో..
గత ప్రభుత్వానికి కొమ్ము కాసి అవినీతి లో భాగం అయినా సెంట్రల్ సర్వీస్ అధికారులు ఫోన్లు ఆపేసి, ఉత్తర భారతం లో బిక్కు బిక్కు మంటూ బ్రతుకున్న వాళ్ళని అడిగితే లోకేష్ సంగతి సూపర్ గా చెప్తారు..

గత ప్రభుత్వం లో అధికారిక సామాజిక వర్గం వాళ్లే అన్ని పదవులు చేసి ఇవ్వాళ్ళ అందరూ వీఆర్ లోకి వెళ్లిపోతుంటే వాళ్ళని ఆపి ఎవరినైనా అడిగితే చెప్తారు లోకేష్ అంటే ఏంటో ఏం చేస్తున్నాడో..

రేపటి నుండి ఉదయం 10గంటలకి ఆఫీస్ కి వెళ్లి రిజిస్టర్ లో సంతకం పెట్టి వెయిటింగ్ హాల్లో సాయంత్రం వరకు కూర్చొని, 5 గంటలకి వెళ్లేప్పుడు మరలా సంతకం పెట్టి వెళ్ళాలిసిన పరిస్తితి సీనియర్ ఐపిఎస్ లకి ఎందుకు వచ్చిందో, ఆ ర్యాగింగ్ ఎలా ఉంటుందో వాళ్లలో ఏ ఒక్కరినీ అడిగిన చెప్తారు లోకేష్ కెపాసిటీ ఏంటో..

సమరసింహా రెడ్డి లో లా.. నీ ఇంటికొచ్చా నీ నట్టింటికొచ్చా టైప్ కాదమ్మా లోకేష్..అతడు లో మహేష్ బాబులా.. గోడ కడుతున్నట్లు గులాబీ మొక్కకి అంటు కట్టినట్లు చాలా శ్రద్ధగా పద్దతిగా కొడతాడు..

ఆడు మగాడ్రా బుజ్జా!

– రమాదేవి
విజయవాడ