రైతు సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ విఫలం
మంత్రి పదవికి ఉత్తమ్ రాజీనామా చేయాలి
త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం
బీజేపీ ఎమ్మెల్యేలు ఏలేటి, పాల్వాయి, రాకేష్‌రెడ్డి, రామారావు
హైదరాబాద్, మహానాడు: రైతు సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఎమ్మెల్యే లు మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాల్వాయి హరీష్, రాకేష్‌రెడ్డి పటేల్, రామారావు మీడియా సమావేశంలో మాట్లాడారు. వడ్ల కొనుగోలుకు బస్తాలు లేవని రకరకాలుగా సాకులు చెబుతున్న రేవంత్‌రెడ్డి అన్ని రకాలుగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం మోసం చేసినట్టే ఈ ప్రభుత్వం 40 కిలోలు అధికంగా కాటా వేసి జోకుతున్నారు. కాటా వేశాక రైతులకు రశీదు ఇవ్వాలని కోరారు. మంత్రి ఉత్తమకుమార్ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని మండిప డ్డారు. రైతుబంధు ఇప్పటివరకు ఇవ్వలేదని, మళ్లీ సీజన్ వస్తుంటే పెట్టుబడి నగదు లేక ఇబ్బందులు పడతారని తెలిపారు. రైతుబంధు 5 ఎకరాల వారికే ఇస్తామని అనడం దారుణమన్నారు.
మంత్రి పదవికి రాజీనామా చేయాలి
డిచిన ధాన్యాన్ని ఇంతవరకు కొనకపోవడం ప్రభుత్వ వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. అన్ని రకాలుగా రైతులను రేవంత్ రెడ్డి మోసం చేశాడు. కొన్ని సెంటర్లలో కోట్ల రూపాయలు లంచాలు చేతులు మారుతున్నాయని మా దృష్టికి వచ్చింది. ఉత్తమకుమార్ పూర్తిగా వైఫల్యం చెందారు..ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాలని కోరారు. అర్హత లేని వారిని మంత్రులుగా, అధికారు లుగా నియమించారని ధ్వజమెత్తారు. రైస్ మిల్లర్లకు, అధికారులకు ఏం ఒప్పం దం ఉంది.. లావాదేవీలు ఉన్నాయో బయటపెట్టాలి? రైస్ మిల్లర్లు ఎందుకు రైతులకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారో అధికారులు, ప్రభుత్వం సమాధానం చెప్పా లి. మీరిచ్చిన హామీలు విషయంలో ఫిడేలు వాయిస్తే సరిపోదు. అధికారులను ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయమని చెప్పండి. వెంటనే రైతుల సమస్యలు పరి ష్కరించే వారిని ఆదుకోవాలి. సన్న బియ్యానికి కాకుండా అన్ని వడ్లకు బోనస్ ఇవ్వాలి. రైతుల పక్షాన త్వరలో బీజేపీ పోరాటం చేయబోతోంది. రేవంత్ రెడ్డికి సినిమా డైలా గులు కొట్టడం అలవాటే..ఎప్పుడు ఊడిపోతుందో తెలియని ప్రభు త్వమిది.. కోమటిరెడ్డి, జగ్గారెడ్డి మాటలకు కూడా సమాధానం చెప్పాలా అని వ్యాఖ్యానించారు.