Mahanaadu-Logo-PNG-Large

కనకపు సింహాసనం మీద కూర్చున్న శునకాలు ప్రతిపక్షాలను కరుస్తున్నాయి

హరీష్ రావు మాట్లాడిందాంట్లో అన్ పార్లమెంటరీ ఏముంది ?
రోజూ మీరు పళ్ళు తోముకోక పోతే భాద్యత కేసీఆర్ దా ?
కాలువలు తవ్వక ముందే మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలది
కాంగ్రెస్ నేతలు ఇంకా చంద్రబాబు వై ఎస్సార్ భజన చేస్తున్నారు.
వాళ్లిద్దరూ తెలంగాణ లో ఒక్క ఎక్కరానికైనా నీళ్లు ఇచ్చారా ?
పైసల బలుపు తో మరికొందరు ఒళ్ళు బలిసి మాపై మాట్లాడుతున్నారు
– మాజీ మంత్రి జి .జగదీశ్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ ,బీ ఆర్ ఎస్ నేతలు చింతల వెంకటేశ్వర్ రెడ్డి ,తుంగ బాలు

హైద‌రాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత విచిత్ర మైన పరిస్థితులు నెలకొన్నాయి. కిరణ్ కుమార్ రెడ్డిదే బలహీన మైన ప్రభుత్వం అనుకుంటే, అంతకన్నా భాద్యతారాహిత్యమైన ప్రభుత్వం రేవంత్ రెడ్డిది. వీధుల్లో కుక్కలు ప్రజలను కరుస్తుంటే కనకపు సింహాసనం మీద కూర్చున్న శునకాలు ప్రతిపక్షాలను కరుస్తున్నాయి.

సీతారామ ప్రాజెక్టు పై మాజీ మంత్రి హరీష్ ఉన్న మాట అంటే కాంగ్రెస్ మంత్రులకు ఉలుకెందుకు? ఓ మంత్రి కంట తడి పెట్టారు. ఎందుకో ఆశ్చర్యం కలిగింది. హరీష్ రావు మాట్లాడిందాంట్లో అన్ పార్లమెంటరీ ఏముంది ? కేసీఆర్ హయాంలో సీతారామ ప్రాజెక్టు పనులు దాదాపు గా పూర్తయ్యాయి. కనీసం బటన్ నొక్కేపుడైనా కేసీఆర్ కష్టం గురించి చెప్పండని మంత్రులను కోరుతున్నా.

రైతు రుణమాఫీ కి 12 వేల కోట్ల రూపాయలు విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. గురుకులాల్లో పరిస్థితులకు కూడా కేసీఆర్ కారణమని భట్టి అంటున్నారు ..ఇంత కన్నా దారుణం ఉంటుందా ? రోజూ మీరు పళ్ళు తోముకోక పోతే భాద్యత కేసీఆర్ దా ? ఉత్తమ్ భాద్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు .కనీసం అధికారులతో ఆయన మాట్లాడుతున్నారా ?

సీతారామ ప్రాజెక్టు పై కేసీఆర్ ప్రభుత్వం 2018 నుంచి 2022 దాకా వరసగా కేంద్రం తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపితే ఈ అనుమతులు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీతారామ ప్రాజెక్టు పై కనీసం ఒక ఉత్తరమైనా రాశారా ? కృష్ణా రివర్ బోర్డు కు ప్రాజెక్టుల అప్పగింత తప్పటడుగు వేసి బీ ఆర్ ఎస్ ఒత్తిడి తో వెనక్కి తగ్గారు. కాంగ్రెస్ హయం లో లాగా కేసీఆర్ ప్రభుత్వం లో ఏ ప్రాజెక్టు అంచనాలు పది ,పదిహేను రెట్లు పెంచలేదు.

కమీషన్లు ఇవ్వడం తీసుకోవడం కాంగ్రెస్ నేతలకు అలవాటు. కాలువలు తవ్వక ముందే మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలది. కాంగ్రెస్ హాయం లో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు కు పదహారు చోట్ల కొబ్బరి కాయలు కొట్టినా పనులు జరిగాయా ? కేసీఆర్ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చాయి. కాంగ్రెస్ నేతలు ఇంకా చంద్రబాబు వై ఎస్సార్ భజన చేస్తున్నారు. వాళ్లిద్దరూ తెలంగాణ లో ఒక్క ఎక్కరానికైనా నీళ్లు ఇచ్చారా ? వై ఎస్సార్ హాయం లో ఆంధ్రా రాయల సీమ ప్రాజెక్టులు పూర్తయి తెలంగాణ ప్రాజెక్టులు పెండింగ్ లో పడ్డాయి.

వై ఎస్సార్ రాయల సీమ కు 350 టీ ఏం సీ ల సామర్ధ్యమున్న ప్రాజెక్టులు పూర్తి చేశారు. తెలంగాణ కు ఏం చేశారు ? వై ఎస్- చంద్రబాబు హాయం లో తెలంగాణ లో మూడున్నర క్యూసెక్కుల సామర్ధ్యం ఉన్న చెరువు నైనా కట్టారా ? ఎవరి హయం లో తెలంగాణ ప్రాజెక్టులు పూరయ్యాయో చర్చకు వస్తారా ఉత్తమ్ గానీ భట్టి గానీ. నేను చర్చకు ఎక్కడైనా రావడానికి రెడీ.

నీళ్లిస్తే వడ్లు పండుతాయని, వడ్లు పండితే ఎక్కడ బోనస్ ఇవ్వాల్సి వస్తుందోనని కాంగ్రెస్ ప్రభుత్వం అవకాశం ఉన్నా సాగునీరు ఇవ్వడం లేదు. కాళేశ్వరం నుంచి అవకాశం ఉన్నా నీళ్లు తోడటం లేదు. తెలంగాణ పాలిట ద్రోహులు ఎవరో దొంగలు ఎవరో తేలాల్సిందే. srbc ,slbc ఒకే సారి మొదలయ్యాయి ..srbc పూర్తయ్యింది ..slbc ఇంకా పూర్తి కాలేదు. slbc పై కాంగ్రెస్ మంత్రులు హంతకులే సంతాప సభ పెట్టినట్టు వ్యవహరిస్తున్నారు.

సీతారామ ప్రాజెక్టు పై మంత్రులు మాట్లాడిన ప్రతీ వాక్యం అబద్దమే. మంత్రులు మాట్లాడిన దానిపై ఎక్కడైనా చర్చకు సిద్దమే. కాంగ్రెస్ కు ముందుంది మొసళ్ల పండగ. కొందరు పైసల బలుపు తో మరికొందరు ఒళ్ళు బలిసి మాపై మాట్లాడుతున్నారు.

ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ సోయి లేదు. తెలంగాణ లోనే తెలంగాణ బిడ్డలను స్థానికేతరులను చేసే విధంగా జీవో 33 తెచ్చారు. ఇంత కన్నా తెలంగాణ కు ద్రోహం ఏముంటుంది ? రేవంత్ తన ఆంధ్రా మిత్రులనో చంద్రబాబు నో సంతృప్తి పరచడానికే జీవో 33 తెచ్చారా ? ఇప్పటికైనా జీవో 33 పై ప్రభుత్వం సోయి తెచ్చుకుని వ్యవహరించాలి. కేసీఆర్ ఎంతో కష్టపడి రాష్ట్రపతి ఉత్తర్వులను సవరింపజేసి స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లు కల్పించారు. జీవో 33 ను వెంటనే రద్దు చేయాలి.