రూ.2,500 కోట్లు ఎటు వెళ్లాయి..రేవంత్‌రెడ్డీ?

-బీసీల వ్యతిరేకి కాంగ్రెస్‌ను బొందపెట్టాలి
-బీఆర్‌ఎస్‌ నేత దూదిమెట్ల బాలరాజు యాదవ్‌

హైదరాబాద్‌, మహానాడు: సీఎం రేవంత్‌రెడ్డి గల్లీలో పేదలకు డబ్బులు పంచకుండా ఢల్లీలో రాహులకు పంచు తున్నాడని బీఆర్‌ఎస్‌ నేత దూదిమెట్ల బాలరాజు యాదవ్‌ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రూ.2500 కోట్లు ప్రభుత్వ ఖజానాలో ఉన్నాయని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇప్పుడు డబ్బులు ఎవరి చేతులోకి వెళ్లాయో చెప్పాలని కోరారు.

రాష్ట్ర వ్యాప్తంగా 83,500 సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పెండిరగ్‌లో ఉన్నాయన్నారు. గొల్ల కురుమలు, యాదవ సోదరులు ఆలోచించా లని, బీఆర్‌ఎస్‌ హయాంలో మనం కట్టిన డీడీలకు డబ్బులు విడుదల చేయకుండా రేవంత్‌ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. గొల్ల కురుమలు నుంచి గెలిచిన బీర్ల ఐలయ్యకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని, బీసీల వ్యతిరేకి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. మున్నూ రు కాపులకు మంత్రి పదవిలో చోటు లేదు.. మైనార్టీలకు మంత్రి వర్గంలో చోటు లేదు.. మాదిగ సామాజిక వర్గానికి సీట్ల కేటాయింపులో అన్యాయం చేశారు..అందుకే పార్లమెంటు ఎన్నికల్లో ఈ సామాజిక వర్గాలు దగాకోరు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలని పిలుపునిచ్చారు.