అమరావతి: ఈ ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం సాధిస్తుందని వైసీపీ చేసిన ప్రచారంపై టీడీపీ ఎక్స్ వేదికగా సెటైర్లు వేసింది. జూన్ 9న విశాఖపట్నంలో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు ప్రచారం చేసుకున్న పోస్టును షేర్ చేసింది. ‘ఎక్కడికి రావాలో చెబితే మేం కూడా వస్తాం జగన్.. అసలుకే బస్సు, రైలు, ఫ్లైట్ టిక్కెట్లు దొరకడం లేదు, హోటల్స్ అన్నీ బుక్ అయిపోయాయని మీ బులుగు మీడియానే చెప్పింది’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించింది.