ఎవరీ హర్షమందర్? .. ఏమా సీబీఐ కథ?

ఆయనపై సీబీఐ కేసు ఎందుకు పెట్టింది
ఎన్జీఓల పేరిట అడ్డగోలు విదేశీ నిధులు
యపీఏ హయాంలో నిధుల ప్రవాహం
తాజాగా ఆయనపై సీబీఐ కేసు
జాతీయ మీడియాలో కనిపించని వార్త
జాతీయ మీడియా కళ్లు మూసుకుందా?
జాతి వ్యతిరేక చర్యలు ధృతరాష్ట్ర మీడియాకు పట్టవా?

ఇది ప్రధాన మీడియాలో పతాక శీర్షిక కింద రావాల్సిన వార్త!
కానీ కనీస కవరేజ్ లేదు!
ఫిబ్రవరి 2శుక్రవారం రోజున హర్ష మందర్ మీద సీబీఐ కేసు రిజిష్టర్ చేసింది.
ఆరోపణలు ఏమిటీ?
విదేశీ నిధుల దుర్వినియోగం!
FCRA (Foriegn Contribution Regulation Act)
ఎవరీ హర్షమందర్?
హర్షమందర్? IAS ఆఫీసర్!
జార్జ్ సొరోస్,సోనియా లకి హర్షమందర్ చాలా దగ్గరి సన్నిహితుడు. అంతే కాదు UPA1,UPA 2 అంటే 2004 నుండి2014 వరకూ అత్యంత శక్తివంతమైన వ్యక్తిగా చెలామణి అయ్యాడు.
హర్షమందర్ IAS ఆఫీసర్!
2002 లో అప్పటి ప్రధాని అటల్ బీహారీ వాజపేయి ప్రధానిగా ఉన్న సమయంలో తన పదవికి రాజీనామా చేశాడు.
సేవ, ఉద్యమం, పేరుతో యాక్టివిస్ట్ అవతారం ఎత్తాడు!

*********

2004 లో UPA అధికారంలోకి రాగానే అసలు రంగు బయటడింది!
2004 లో నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ (National Advisory Council- NAC) ఏర్పాటు చేశారు.
ఆ NAC లో హర్షమందర్ ఒక సభ్యుడు. సోనియా NAC చైర్మన్!
NAC ఎందుకు ఏర్పాటు చేశారు?
ప్రధాని మన్మోహన్ సింగ్ కి సలహాలు సూచనలు ఇవ్వడానికి!
నిజానికి సోనియా చైర్మన్ గా ఉన్న NAC ఏది చెపితే అదే చేశారు మన్మోహన్ సింగ్!
పరోక్షంగా సోనియా అండ్ కో దేశాన్ని పరిపాలించింది 10 ఏళ్లపాటు NAC ద్వారా.

********

హర్ష మందర్ NAC లో సభ్యుడుగా ఉన్నప్పుడే మత ఘర్షణల (Communal Voilance Bill)బిల్లు ముసాయిదా తయారయ్యింది.
ఈ బిల్లు ముసాయిదా లో ఏముంది?
దేశంలో ఎక్కడ మత ఘర్షణలు జరిగినా, హిందువులు బాధ్యత వహించాలి! అంటే పోలీసులు కేసు హిందువుల మీద పెడతారు. హిందువులే తాము నిర్దోషులు అని నిరూపించుకోవాలి కోర్టులో!
ఈ బిల్లు ముసాయిదాను రూపొందించడం లో హర్ష మందర్ తో, అతని మిత్రుడు బ్రిటన్ జాతీయుడు అయిన జీన్ డ్రేజ్ కూడా ఉన్నాడు.
2011 లో ఈ బిల్లు ముసాయిదా సిద్ధం అవగా, అంతకు ముందు హర్ష మందర్,జీన్ డ్రెజ్ లు NAC నుండి వైదొలిగారు!

*******

హర్షమందర్ రెండు NGO లని నిర్వహిస్తున్నాడు!
ఐఏఎస్ అధికారి అయి ఉండి NGO లని ఎలా నడుపుతున్నాడు?
ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ NGO లని ఎలా స్థాపించాడు?

1998-2002 వరకూ ఉద్యోగం చేస్తూ NGO లని స్థాపించాడు అవి:

1. అమన్ బిరదారీ ట్రస్ట్ (Aman Biradri Trust).
2. సెంటర్ ఫర్ ఈక్విటీ స్టడీస్ (Centre for Equity Studies).

ఈ రెండు NGO లకి బ్రిటన్ పౌరుడు అయిన జీన్ డ్రెజ్ సహ వ్యవస్థాపకుడు గా ఉన్నాడు.
ఈ రెండు NGO లకి 1998-2002 ల మధ్య అప్పటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుండి భారీగా విరాళాలు వచ్చాయి.
Well! తాను ఐఏఎస్ అధికారి గా ఉంటూ నడిపిన NGO లలో బ్రిటీష్ జాతీయుడు అయిన జీన్ డ్రెజ్ వాటిని నడిపాడు. అందుకే వాజ్పేయి ప్రధానిగా ఉన్న 2002 లో, తన ఐఏఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశాడు హర్షమందర్.
2004 లో UPA అధికారంలోకి రాగానే NAC లో సభ్యుడు అవడమే కాదు. కేంద్ర ప్రభుత్వాన్ని కంట్రోల్ చేసే స్ధాయికి ఎదిగాడు. ఎందుకంటే సోనియా, జార్జ్ సోరోస్ లకి అత్యంత సన్నిహితుడు కాబట్టి.

*********

NAC లో కి సోనియా హర్షమందర్ తో పాటు, బ్రిటీష్ జాతీయుడు అయిన జీన్ డ్రేజ్ ను కూడా సభ్యుడిగా నియమించింది.
ఎందుకు?
సోనియా,రాహుల్ లకి బ్రిటన్ తో ఏమి సంబంధం?
గత పదేళ్ల నుండి బ్రిటన్, పాకిస్థాన్ దేశాల ఆర్థిక పరిస్థితి ఎందుకు దిగజారి పోతూ వచ్చింది?
ఎన్నడూ లేనివిధంగా బ్రిటన్, పాకిస్థాన్ లలో వరసగా ప్రధానులు ఎందుకు మారుతున్నారు?
లోతుగా అధ్యయనం చేస్తే కానీ పై ప్రశ్నల కి సమాధానం దొరకదు!

********

హర్షమందర్ ఒక విదేశీ NGO అయిన యాక్షన్ ఎయిడ్ ) కి భారత్ లో మేనేజర్!
2014 లో మోడీజీ దీనిని నిషేధించారు!
విచిత్రంగా ఈ యాక్షన్ ఎయిడ్ NGO కి కూడా, 1998 నుండి 2002 వరకూ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల నుండి భారీగా విరాళాలు వచ్చాయి!

******

హర్షమందర్ ఢిల్లీ లో ఉన్న మరో NGO క్విల్ ఫౌండేషన్ లో కీలకమయిన స్థానంలో పనిచేస్తున్నాడు.
ఈ క్విల్ ఫౌండేషన్ దేనికోసం స్థాపించడబడింది?
క్విల్ ఫౌండేషన్ అనేది భారత్ లో ముస్లింస్ మీద, హిందువులు చేసే దాడులని రికార్డ్ చేసి దానికి ఒక డేటా బ్యాంక్ లో ఉంచుతారు.
ఆ డేటా బ్యాంక్ పేరు డూటు (DOTO).

1.DOTO డేటా బ్యాంక్ ను 2018 లో ప్రారంభించారు.
2. దీని ప్రారంభోత్సవానికి ఎవరెవరు హాజరయ్యారో తెలుసా?
3. రామ్ పున్యాని, తీస్తా తేసెల్వాడ్, జఫర్ ఉల్ ఇస్లామ్ ఖాన్, జాన్ దయాల్,రవి నాయర్, సబా నక్వీ మరియు ఇతర యాంటీ బీజేపీ యాక్టివిస్టులు.
క్విల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో DOTO డేటా బ్యాంక్ ఎవరెవరు వాడుకుంటున్నారు?
4. అమెరికాలో ఉన్న NGO పేరు ‘ సేవ్ ఇండియా ‘ వాడుకుంటుంది.
5. అమెరికాలో ఉన్న సేవ్ ఇండియా NGO అనేది మరో అమెరికన్ NGO అయిన ICNA ( US ISLAMIC CIRCLE OF NORTHERN AMERICA) కి ముసుగు అన్నమాట!
6.ICNA ను స్థాపించింది పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న టెర్రర్ గ్రూపులు. నిధులు కూడా టెర్రర్ గ్రూపులు నుండి వస్తాయి ICNA కి.
7. ఈ NGO లు అన్నీ హర్షమందర్ DOTO డేటా బ్యాంక్ ను వాడుకొని, భారత్ లో ముస్లింలపై దాడులు జరుగుతున్నాయి, మైనారిటీలు ప్రమాదంలో ఉన్నారు అంటూ మోడీజీ కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు.
8. హర్షమందర్ NGO లోని ఒక సభ్యుడు, భాగస్వామి అయిన అజిత్ సాహి అమెరికాలో ఉన్న మరో NGO అయిన ఇండియన్ అమెరికన్ ముస్లిమ్స్ (IAMC – Indian American Muslims) లో సలహాదారుడు మరియు డైరెక్టర్ కూడా.
9.IAMC ను స్థాపించింది షేక్ ఉబైద్ (Sheik Ubed) ఇతనికి జమాతే -ఇ – ఇస్లామీ తో దగ్గరి సంబంధం ఉంది.
9. హర్ష మందర్ జార్జ్ సోరోస్ కి చెందిన ఓపెన్ సోర్స్ ఫౌండేషన్ కి చెందిన హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ అడ్వైజరీ బోర్డ్ కి చైర్మన్!
10. హర్ష మందర్ మరో అమెరికన్ NGO అయిన ‘ ద జస్టిస్ ఫౌండేషన్ ‘ లో ఒక డైరెక్టర్. జస్టిస్ ఫౌండేషన్ ను పెట్టింది అయ్యుబ్ ఠాకూర్ (Ayyub Thakur). ఈ ఆయ్యుబ్ ఠాకూర్ పాకిస్థాన్ ISI కి అమెరికాలో ఏజెంట్.
11. హర్షమందర్ విజిటింగ్ ఫాకల్టీ గా JNU, జామియా మిలియ ఇస్లామీయ,IIM అహ్మదాబాద్, St. స్టీఫెన్సన్ మరి కొన్నింటికి లెక్చర్లు ఇస్తుంటాడు.
12. ఎంతమంది విద్యార్థుల బ్రెయిన్ వాష్ చేసి ఉంటాడు ఇప్పటివరకూ?

*******

ఇది మరీ నీచం:

జార్జ్ సోరోస్ కి చెందిన మరో NGO ప్రియో (PRIO) హర్షమందర్ తో పాటు ఆల్ట్ న్యూస్ జుబెర్ పేర్లని నోబెల్ శాంతి బహుమతి కోసం నామినేషన్ చేసింది.
ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం అయినా మళ్లీ మళ్లీ నామినేషన్ చేస్తూనే ఉంటాడు జార్జ్ సోరోస్!

*********

ఈ రోజు పార్లమెంట్ లో మోడీజీ కాంగ్రేస్ మీద విరుచుకు పడ్డారు ఎందుకో తెలుసా?
ఫిబ్రవరి 3న CBI హర్షమందర్ మీద కేసు రిజిష్టర్ చేసిన తరువాత దొరికిన సమాచారం ఆధారం చేసుకుని చాకిరేవు పెట్టారు. ఈ రోజు మోడీజీ మాట్లాడినట్లు గతంలో ఎప్పుడూ అంత ఆగ్రహంగా మాట్లాడలేదు.
కారణం ఉంది కదా?

జైహింద్!

– పార్థసారథి పోట్లూరి