వాల్మీకి స్కామ్ పై ఎందుకు నోరు మెదపడం లేదు?

– ఈడీ విచారణ కోరే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా?
– రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి గజదొంగ
– రుణమాఫీ విషయంలో రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి మోసం చేశారు
– ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి బెయిల్ బీజేపీ ఇస్తేనే వచ్చిందా?
– 50 లక్షల రూపాయలు ఇస్తూ దొరికిన దొంగ రేవంత్ రెడ్డి
– పొంగులేటి ఇంటికి ఏమైనా స్పెషల్ గా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉందా?
– మాజీమంత్రి,ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు చిట్ చాట్

హైదరాబాద్: రేవంత్ రెడ్డి చేసేది చిట్ ఛాట్ కాదు…చీట్ ఛాట్. ఢిల్లీలో చిట్ చాట్ చేస్తూ ఓల్డ్ సిటీ విద్యుత్ బకాయిలను ఆదానీకి అప్పగిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో మేము అడిగితే మేమెక్కడ అన్నామని అంటున్నారు. అబద్ధాలను,గోబెల్స్ ను ప్రచారం చేస్తున్నారు.

రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి గజదొంగ. వంద శాతం రుణమాఫీ చేస్తామని మోసం చేశావు.మీ మంత్రులు,ఎమ్మెల్యేలు రుణమాఫీ జరగలేదని అంటున్నారు. రుణమాఫీ కాలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే అధికారులపై పేపర్లు విసిరేశారు. రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుందని తుమ్మల చెప్పారు.

ఆగస్టు 15 లోగా ఎందుకు రుణమాఫీ చేయలేకపోయారు? నేను విసిరిన ఛాలెంజ్ అదే.50 లక్షల రూపాయలు ఇస్తూ దొరికిన దొంగ రేవంత్ రెడ్డి. బిఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి.

ఢిల్లీలో రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారు. రాహుల్ గాంధీ ఎప్పుడు హైదరాబాద్ వస్తారో చెప్పాలి. నేను ఎయిర్ పోర్టుకు వెళ్లి రాహుల్ గాంధీని రిసీవ్ చేసుకుని, సీఎం స్వంత గ్రామానికి రుణమాఫీ అయిందో లేదో చెప్పడానికి తీసుకువెళ్తా. వ్యవసాయ శాఖా మంత్రి చెప్పినట్లు 20 లక్షల మందికి రుణమాఫీ కాలేదు.రుణమాఫీ విషయంలో రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి మోసం చేశారు.వరంగల్ సభకు రాహుల్ గాంధీని మూడు సార్లు రేవంత్ రెడ్డి పిలిచినా రావడం లేదు.

వాల్మీకి స్కామ్ పట్టపగలు నిలువు దోపిడీ. ప్రభుత్వ డబ్బుతో కార్లు,బంగారం కొన్నారు. తెలంగాణకు చెందిన తొమ్మిది కంపెనీల అకౌంట్స్ కు డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి.వాల్మీకి స్కామ్ పై కాంగ్రెస్ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదు? వాల్మీకి స్కామ్ డబ్బులు ఎవరికి వచ్చాయో నేను,రేవంత్ రెడ్డి వెళ్లి ఈడీ విచారణ కోరుతాము. దానికి రేవంత్ రెడ్డి సిద్ధమా? వాల్మీకీ స్కామ్ పై ఈడీ విచారణ కోరే దమ్ము కాంగ్రెస్ పార్టీకి ఉందా.?

తెలంగాణలో కాంగ్రెస్,బీజేపీ కుమ్మక్కు అయ్యాయి. వాల్మీకి స్కామ్ పై తెలంగాణలో ఈడీ విచారణ ఎందుకు జరగడం లేదు? వాల్మీకి స్కామ్ పై రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటంలేదు? వాల్మీకి స్కామ్ పై కాంగ్రెస్,బీజేపీ నేతలు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు మాట్లాడటం లేదు? వాల్మీకి స్కామ్ పై ఈడీ విచారణ చేయాలని బిఆర్ఎస్ తరపున ఈడీని కలుస్తాము.

కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కూల్చివేతల సర్కార్. హైదరాబాద్ బ్రాండ్ ను కూల్చివేశారు. కేసీఆర్ కిట్,రైతు బంధును కూల్చి వేశారు.ఎమ్మెల్యేల ఫిరాయింపుతో ప్రజాస్వామ్యాన్ని కూల్చారు. రాష్ట్రంలో వైద్య వ్యవస్థను కూల్చారు. దేవుళ్ళపై ఒట్టు వేసి ప్రజల విశ్వాసాలను కూల్చారు. గొర్రెల కాపర్ల ఉపాధిని కూల్చారు.

హైడ్రా ఆఫీసు బుద్ధ భవన్ నాలా కింద ఉంది దాన్ని కూలగొడతారా? రంగనాధ్ తన ఆఫీసును కూలగొట్టుకుని ఇతర బిల్డింగులు కూలగొట్టాలి. జిహెచ్ఎంసి ఆఫీసు నాలా కింద ఉంది.దాన్ని కూలగొడతారా? నెక్లెస్ రోడ్ పక్కన ఉన్న రెస్టారెంట్స్,ఇతర వాణిజ్య భవనాలను కూలగొడతారా?

మీరాలం,ఉప్పల్, రామంతపూర్ చెరువుల్లో పెద్ద,పెద్ద టవర్లు వచ్చాయి. పొంగులేటి ఇంట్లో నీళ్లు చెరువులోకి వెళ్తున్నాయా? ఎక్కడికి వెళ్తున్నాయి? పొంగులేటి ఇంటికి ఏమైనా స్పెషల్ గా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉందా? మిషన్ కాకతీయపై విచారణ చెయ్యి అధికారం నీ చేతులోనే ఉంది కదా రేవంత్ రెడ్డి.

తెలంగాణ తల్లి విగ్రహానికి శంఖుస్థాపన చేస్తే మంత్రులు ఎవరు రాలేదు. తెలంగాణ తల్లికి రూపం ఇచ్చింది కేసీఆర్. కేసీఆర్ ఆనవాళ్ళపై రేవంత్ రెడ్డి నిలబడ్డారు. సీఎం స్థాయిలో ఉండి సుప్రీంకోర్టు తీర్పును తప్పుబట్టడం నేరం. వక్రబుద్ది ఉంటే అన్ని వంకరగా కనిపిస్తాయి. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డికి బెయిల్ బీజేపీ ఇస్తేనే వచ్చిందా? సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. కవిత బెయిల్ విషయంలో న్యాయం,ధర్మం గెలిచింది. ఈడీ,సీబీఐ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సిసోడియా కు బెయిల్ వస్తే బీజేపీతో పోరాటం.. కవితకు బెయిల్ వస్తే బీజేపీతో లాలూచీనా?

ఫోర్త్ సిటీ పేరుతో ప్రభుత్వ భూములు కొల్లగొట్టే కుట్ర జరుగుతోంది. సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు బయటపెడతాను. కందుకూరులో 385 ఎకరాలు సర్వే నంబర్ 9 లో ప్రభుత్వ భూమిని కొల్లగొట్టడానికి సర్వే చేస్తున్నారు. తుక్కుగూడలో 25 ఎకరాలు సర్వే నంబర్ 895 లో పేద రైతుల దగ్గర బినామీల పేరుతో తీసుకుంటున్నారు. ముచ్చర్లలో ప్రభుత్వంలో పెద్దలుగా చలామణీ అవుతున్న తమ్ముళ్ల పి.ఏ ల పేరు మీద భూములు కొంటున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి స్వంత నియోజకవర్గం కొడంగల్ లో ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారిటీ తగ్గింది. రేవంత్ రెడ్డి దగ్గర ఉండి డి.కె.అరుణను గెలిపించారు. మోడీతో మాట్లాడుకొని వచ్చి తెలంగాణలో బీజేపీ ఎంపీలను రేవంత్ రెడ్డి గెలిపించారు. హైడ్రా విషయంలో అందరికీ ఒకటే రూల్ ఉండాలి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న పట్నం మహేందర్ రెడ్డి,గుత్తా అమిత్ రెడ్డిని రేవంత్ రెడ్డి సస్పెండ్ చేయాలి. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చి స్థానికసంస్థల ఎన్నికలు జరపాలి. రాహుల్ గాంధీ ఆదానీ వద్దు అంటే, రేవంత్ రెడ్డి అదానీ కావాలని అంటున్నారు. రుణమాఫీపై మేము రిపోర్ట్ ఇస్తే రేవంత్ రెడ్డి సీఎం పదవిలో ఉండి ఎందుకు? ప్రజల కోసం పోరాడే బాధ్యతను ప్రజలు
బిఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు.