– హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం!
హైదరాబాద్, మహానాడు: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ)పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశం మేరకు విచారణకు హైడ్రా కమీషనర్ రంగనాథ్ వర్చువల్‌గా హాజరయ్యారు. కోర్టు రంగనాథ్‌కు చీవాట్లు పెట్టింది. హైకోర్టు ఏమన్నదంటే… ఆదివారం రోజు ఎందుకు కూల్చివేతలు చేశారో చెప్పండి. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చివేతలు చేస్తున్నారో చెప్పండి. పత్రికలు చెప్పినట్లు వింటున్నారా లేక లా ఫాలో అవుతున్నారా? హైడ్రాకు ఉన్న చట్టబద్దత ఏంటో చెప్పండి.. మీరు చట్టాన్ని ఉల్లఘించి కూల్చివేతలు చేస్తున్నారు.
ఆదివారం కూల్చివేతలు చేపట్టవద్దని ఇదే హై కోర్టు ఇచ్చిన ఆదేశాలు మీకు తెలియదా? చార్మినార్‌ను కూల్చాలని అక్కడి ఎమ్మార్వో చెబితే మీరు కోల్చేస్తారా? నేనడిగిన ప్రశ్నకు మాత్రమే సమాధానం చెప్పండి.. జంప్ చేయకండి. అమీన్పూర్ పై మాత్రమే మాట్లాడండి.. కావూరి హిల్స్ గురించి నేను అడగలేదు. అమీన్పూర్లో భవనాన్ని 48 గంటల్లో కాలి చేయాలని నోటీసులు ఇచ్చి 40 గంటల్లోనే ఎలా కులుస్తారు అని తహశీల్దార్ పై కూడా హైకోర్టు సీరియస్ అయింది.