అమర్నాథ్ గౌడ్ సజీవ దహనంపై ఎందుకు స్పందించలేదు?

– మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ల నారాయణ

రేపల్లె నియోజకవర్గంలో పాము వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ గూండాలు అమర్నాథ్ గౌడ్ అనే విద్యార్థి అక్కను వివిధ రకాలుగా వేధింపులకు గురి చేశారు. దానిపై పదవ తరగతి చదివే అమర్నాథ్ గౌడ్ తన అక్కను ఎందుకు వేధిస్తారని? వైసీపీ రౌడీలను ప్రశ్నించాడు. ఇందుకు ఆగ్రహించిన పాము వెంకటేశ్వర రెడ్డి, అతని రౌడీ గ్యాంగ్ అమర్నాథ్ గౌడ్ ను కింద పడేసి కొట్టారు. అతని వద్ద ఉన్న పుస్తకాల్ని చించి అమర్నాథ్ గౌడుపై వేశారు.

పెట్రోల్ పోసి అమర్నాథ్ గౌడును సజీవ దహనం చేశారు. ఈ అమానుష హత్యపై రాష్ట్రంలో సంచలనం రేగింది. విధిలేని పరిస్థితుల్లో పోలీసులు కేసు నమోదు చేశారు. బెయిల్ పై వచ్చిన పాము వెంకటేశ్వర రెడ్డి అమర్నాథ్ గౌడ్ ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని బెదిరించాడంటే అతనికి ఈ ప్రభుత్వ అండ లేకుంటే ఇది సాధ్యమా? ఇంతటి ఘోరకలి జరిగితే ముఖ్యమంత్రి స్పందించలేదు. బాధిత కుటుంబాన్ని పరామర్శించలేదు. బీసీలవి ప్రాణాలు కాదా? గులకరాయి తగిలితే గోల చేసేవారు అమర్నాథ గౌడ్ సజీవ దహనంపై ఎందుకు మాట్లాడడం లేదు?