డీజీపీని కలిసి నిలదీసిన బీజేపీ అభ్యర్థి రఘునందన్
సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్
హైదరాబాద్, మహానాడు : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డిని పోలీసులు ఎందుకు అరెస్టు చేయడం లేదని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు శనివారం డీజీపీని కలిసి నిలదీశారు. తక్షణమే అరెస్టు చేయాలని ఫిర్యాదు చేశారు. డబ్బుల రవాణా కోసం ఎస్సై సారా సాయికిరణ్‌ను వెంకటరామిరెడ్డి నియ మించినట్లు మార్చి 29న రాధాకిషన్‌రావు విచారణలో చెప్పాడు. రాధాకిషన్‌రావు ఆదేశాల మేరకు వెంకటరామిరెడ్డికి డబ్బులు తరలించానని ఎస్సై సాయికిరణ్ చెప్పాడు. ఆ డబ్బులు ఎన్నికలకు ఉపయోగ పడ్డాయని వాంగ్మూలంలో రాధాకిషన్‌రావు వెల్లడిరచారు. యశోద ఆసుపత్రి, ప్రతిమ శ్రీనివాస్, రాజ్ పుష్ప కంపెనీల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశామని స్పష్టంగా చెప్పారు. అయినా ఇప్పటివరకు వెంకటరామిరెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నిం చారు. ఆధారాలతో డీజీపీకి ఫిర్యాదు చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి వియ్యంకుడు కాబట్టే అరెస్టు చేయలేదా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్‌కు చెంచాగిరి చేసిన వెంకట రామి రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని, ఎన్నికల కోడ్ ముగిశాక అరెస్టు చేయకపోతే ఆందోళన, లేదంటే న్యాయవాదిగా పోరాటం చేస్తానని తెలిపారు.