వాస్తవాలు దాచి సీఈవోపై అసత్య ప్రచారాలా?
కౌంటింగ్‌లో మీ కుటిల ప్రయత్నాలు ఫలించవు
కేసును విడి చాలెంజ్ అన్నప్పుడే డొల్లతనం బయటపడిరది
వైసీపీ నేతలపై టీడీపీ నేత, ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఫైర్
పోస్టల్ బ్యాలెట్ అంటే వైసీపీ నేతలు ఎందుకు అంతగా భయపడుతున్నారో అర్థం కావడంలేదని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు తెలిపారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావే శం లో ఆయన మాట్లాడారు. నిన్న హైకోర్టులో వైసీపీ పార్టీ తరపున సీఈవో ఇచ్చిన ఒక వివరణ మీద పిటిషన్ వేశారు. మళ్లీ కేసును విత్ డ్రా చేసుకునే పరిస్థితి వచ్చింది..అది చెప్పకుండా సీఈవో ఒక మెమోను విత్ డ్రా చేసుకుంటున్నామని చెప్పారన్న విషయాన్ని చెప్పుకుంటున్నారు. సీఈవో టీడీపీకి అనుకూలంగా వ్యవహ రిస్తున్నారని వారి బ్లూ మీడియాలో రాసుకున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియా ల్సిన అవసరం ఉంది.
వాస్తవాలు తెలుసుకోండి…2023 సర్క్యులర్‌నే ఇచ్చారు
కేంద్ర ఎన్నికల కమిషనర్ పోస్టల్ బ్యాలెట్‌లో ఓటేసినప్పుడు 13 ఏ డిక్లరేషన్ ఇవ్వాలని 19.07.2023లోనే సర్క్యులర్ ఇచ్చారు. అందులో గెజిటెడ్ ఆఫీసర్ సతకం పెట్టాలి. పోల్ జరిగిన ఫెసిలిటేట్ సెంటర్ వద్ద గెజిటెడ్ ఆఫీసర్ ఉండాలి. ఆయనే సంతకం పెట్టి స్టాంప్, సీల్ వేసి ఇవ్వాలి. ఇది ప్రభుత్వ బాధ్యత. ఎక్కడైనా పొరపాటున స్టాంప్, సీల్ లేకపోయినా అటువంటి బ్యాలెట్‌లను తిరస్కరించొద్దని కౌంట్ చేయాలని 2023లోనే కేంద్ర ఎన్నికల కమిషనర్ సర్క్యులర్ ఇచ్చారు. నేడు దాన్ని ఉటంకిస్తూ సర్క్యులర్ ఇచ్చారు. టీడీపీ మొదటి నుంచి కొన్ని చోట్ల స్టాంపు లు, సీళ్లు వేయలేదని చెప్పాం..కొన్ని చోట్ల ఆర్‌వో సంతకం లేదు. కేంద్ర ఎన్నికల కమిషనర్ సర్క్యులర్ ప్రకారం వాటిని కూడా అనుమతించాలని ఉంది. దానినే కేంద్ర ఎన్నికల కమిషనర్ యధాతథంగా వివరిస్తూ సర్క్యులర్ ఇచ్చారు. ఒకవేళ ఎక్కడైనా అటెస్టేషన్ ఆఫీసర్ సంతకాలు లేకపోతే ఆ వివరాలు రాష్ట్రంలోని ఆర్వోలకు పంపాలన్నారు. పోస్టల్ బ్యాలెట్‌లో వెనుక సంతకాలు లేకపోతే ఆ పోస్టల్ బ్యాలెట్ అకౌంట్‌లో బ్యాలెట్ సీరియల్ నెంబర్ చూసి ట్యాలీ అయితే దాన్ని కౌంట్ చేసి పరిగణలోకి తీసుకోవాలని స్పష్టంగా చెప్పారు. దాన్ని వైసీపీ వారు ఏదేదో ప్రచారం చేసుకుంటున్నారు.
కేసు నుంచి తప్పించుకునేందుకు నాటకాలు
వైసీపీ వారు ప్రస్తుత కేసును వారు కంటిన్యూ చేయకుండా కేంద్ర ఎన్నికల కమిష న్ ఇచ్చిన వివరణను విడిగా చాలెంజ్ చేస్తామని కోర్టుకు తెలిపింది. అందుకు కోర్టు అంగీకరించింది. కేసు నుంచి తప్పుకోవటమే కాకుండా కేంద్ర ఎన్నికల కమిషన్ యొక్క వివరణపై చాలెంజ్ చేస్తామని కోర్టుకు చెప్పటంలోనే వారి డొల్ల తనం తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన వివరణ ప్రకారం ఫారం 13ఏను పైన చెప్పిన అన్ని సందర్భాల్లో దానిని తిరస్కరించటం కుదరదు. ధృవీకరణ అధికారి వివరాలు రాష్ట్రంలోని ఆర్‌వోలు అందరికీ తెలియజేయాల్సిన అవసరం లేదని ఆ పేరాలోని వివరణను ఏపీ సీఈవో ఉపసంహరించుకున్నారు.
మళ్లీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తాం
వైసీసీ దిగజారుడుతనం ఈ కేసులో స్పష్టంగా తెలుస్తోంది. 1ప్లస్1R2 అని ప్రపంచమంతా అంగీకరించినా కాదు 11 అని అసత్యాలు చెబుతున్నారు. ఈ పోస్టల్ బ్యాలెట్ విషయంలో ఇచ్చిన వివరణ ప్రకారం ఏపీ సీఈవో ఇచ్చిన వివరణ చివరకు చట్టబద్ధంగా నిలబడుతుంది. వైసీపీ నేతల కుటిల ప్రయత్నాలు ఖచ్చితం గా వికటిస్తాయి. ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా దీని మీద మళ్లీ మేము కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిసి ఎన్నికల కమిషన్ ఏదైతే వివరణ ఇచ్చిందో ఆ వివరణను అమలు చేయాలని కోరనున్నాం. వైసీపీ చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని ఉద్యోగ సంఘాలు కూడా ఆలోచించాలి. వారు కూడా ఈ రిట్‌లో కలిస్తే మంచిది. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు.