రుషికొండ పై ఎందుకీ దాగుడుమూతలు?

– ట్విట్టర్ వేదికగా వైసీపీకి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చురకలు

విశాఖ : రాజకోట రహస్యం ఎన్నికల ముందే వెల్లడై ఉంటే 11 సీట్లు వచ్చేవి కావు. రుషికొండ భవన నిర్మాణంపై ఎందుకీ కుప్పిగంతులు, దాగుడుమూతలు? మొదట టూరిజం ప్రాజెక్ట్ అన్నారు.. తర్వాత ఫైవ్ స్టార్ హోటల్ అన్నారు. అనంతరం సీఎం క్యాంప్ ఆఫీస్ అన్నారు. ఏ నిర్మాణమైనా ప్లాన్ వివరాలను ఆ కట్టడం దగ్గర ప్రదర్శిస్తారు. సెక్యూరిటీ కారణాల వల్ల అలా చేయలేదనడం విడ్డూరంగా ఉంది. రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ బసకు INS డేగ, నేవల్ గెస్ట్ హౌస్ వంటి నిర్దిష్ట విడిది ప్రాంతాలు ఉన్నాయి. వీఐపీలు ఉండే భవనాలు కావడం వల్ల రుషికొండ మీద ఏం కడుతున్నామో చెప్పలేకపోయామని మాజీ మంత్రి అమర్నాథ్ అనడం హాస్యాస్పదం.