Mahanaadu-Logo-PNG-Large

కేసీఆర్‌ను ఎందుకు అరెస్టు చేయట్లేదు?

-ఫోన్‌ ట్యాపింగ్‌ అతిపెద్ద నేరం
-బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్‌

హైదరాబాద్‌, మహానాడు: బీఆర్‌ఎస్‌ కుంభకోణాలు, నేరాల్లో మరో అతిపెద్దది ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం. ఇది దేశానికే మాయని మచ్చ. కేసీఆర్‌ కుటుంబం, వారి సన్నిహిత పోలీసు అధికారుల బృందం నడిపించిన ఈ వ్యవహారం దేశాన్నే కుదిపేస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్‌ వ్యాఖ్యానించారు. ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ టి.ప్రభాకర్‌ రావు, భుజంగరావు, తిరుపతన్న వంటి పోలీసు ఆఫీసర్లతో ట్యాపింగ్‌ వ్యవహారాన్ని నడిపించి రాజకీయ స్వార్థం కోసం వాడుకున్న వారిని శిక్షించాల్సిందిపోయి కాంగ్రెస్‌ ప్రభుత్వం కాపాడే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతోనే చేయించినట్లు ప్రభాకరరావు అంగీకరించినట్లు తెలిసింది. ఇప్పుడు మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు వాంగ్మూలంలో కేసీఆర్‌ ఆదేశా లతోనే ప్రత్యర్థి పార్టీ నాయకుల ఫోన్లను ట్యాపింగ్‌ చేశారని ఒప్పుకున్నట్లు అధికా రులు ప్రకటించారు. కేసీఆర్‌ను ఇంకా ఎందుకు అరెస్టు చేయట్లేదు? అని ప్రశ్నించారు.