రాష్ట్రం లో ఆటవిక పాలన

– డీజీపీ కార్యాలయం లో అడిషనల్ డీజీ మహేష్ భగవత్ కు మెమోరాండం ఇచ్చిన బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు కె .పి .వివేకానంద, మాధవరం కృష్ణా రావు

హైదరాబాద్: రాష్ట్రం లో ఆటవిక పాలన నడుస్తోందనడానికి నిన్న ఖమ్మం లో బీ ఆర్ ఎస్ నేతల పై జరిగిన దాడులే నిదర్శనం. సీఎం రేవంత్ రెడ్డి కనుసన్నల్లో ఖమ్మం లో మాపై దాడి జరిగింది. వరద బాధితులకు బీ ఆర్ ఎస్ అండగా నిలుస్తుండటాన్ని సీఎం ఓర్చుకోలేకే ఖమ్మంలో దాడులకు రౌడీ షీటర్ల ను పురమాయించారు. ఈ దాడి ని సీఎం కార్యాలయం పర్యవేక్షించింది.

దాడి లో పాల్గొన్న కాంగ్రెస్ నేతలకు పోలీసులు అండగా నిలిచారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించిన తీరును మహేష్ భగవత్ కు వివరించాం. దాడులకు పాల్పడ్డ వారి వివరాలు పోలీసులకు అందజేసినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోని విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చాము.వెంటనే నిందితులను అరెస్టు చేయాలని కోరాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కోరాం. శాంతి భద్రతలు పరిరక్షించేలా వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేశాము.