-వ్యాపారులకు కూటమి ప్రభుత్వం అండ
-టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి
-ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం
ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు: దర్శి పట్టణ అభివృద్ధిలో ఆర్యవైశ్యుల పాత్ర కీలకమని, వారు ట్యాక్స్‌ల వసూలు వల్ల గతంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి భరోసా ఇచ్చారు. దర్శి పట్టణం అద్దంకి రోడ్డులోని పద్మావతి కల్యాణ మండపంలో ఆదివారం ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథులుగా గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్, ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి. పాపారావు, దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య హాజరయ్యారు. గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ దర్శి పట్టణంలో ట్యాక్స్‌ల వసూలు వల్ల గతంలో వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొ న్నారన్నారు. వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని, అధికారుల వేధింపులు ఉండవని భరోసా ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో ఇకపై అలాంటి పరిస్థితులు ఉండవని హామీ ఇచ్చారు.
దర్శిలో వ్యాపారాల అభివృద్ధికి తన వంతు సహకారం ఉంటుందని తెలిపారు. కరెంటు చార్జీల మోత, డీజిల్, పెట్రోలు ధరల పెరుగుదల వల్ల ఆయా వర్గాలు ఇబ్బందులు పడుతున్నారని, దాచుకోవడం, దాచుకోవడం తప్ప అన్ని వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వంలో మోసపోయారన్నారు. దర్శి ప్రాంతాన్ని వ్యాపార వాణిజ్య అభివృద్ధి ప్రాంతంగా తీర్చిదిద్దుదాం… అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో ఒంగోలులో ప్రశ్నించిన ఆర్యవైశ్యుడు సుబ్బారావుపై వేధింపులు చూశారు…ఇకపై కూటమి ప్రభుత్వంలో వారందరికీ న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు సూరే సుబ్బారావు, దర్శి ఆర్యవైశ్య నాయకులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్లు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు అచ్చుతా గురువర్జనరావు, తాతా ప్రసాద్, స్టేట్ వాణిజ్య విభాగం మెంబర్ మునగా వెంకన్న, దర్శి వాణిజ్య విభాగం మెంబర్ జెమిలి నాగేశ్వరావు, కాళ్ల వెంకటే శ్వర్లు, కిషోర్ కుమార్, దేవతి మహానంద, మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ ఒగ్గు పవన్, దర్శి ఆర్యవైశ్య, టీడీపీి, జనసేన, బీజేపీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.