-చేవెళ్ల రైతు దీక్షలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, గురువారం జరిగిన చేవెళ్ల రైతు నిరసన దీక్షలో పాల్గొని, కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి చేసిన వాగ్దానాలు రైతులను మోసం చేయడమేనని, ఆయన పాలన వల్ల రైతుల జీవితాలు ఆగిపోయాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
డిసెంబర్ 9న రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానని రేవంత్ రెడ్డి సోనియా గాంధీ మీద ఒట్టేసి చెప్పాడు. కానీ, ఆయన మాట మార్చి, రుణమాఫీ చేయలేమని చెప్పడం రైతులను ద్రోహం చేయడమే. బ్యాంకర్లతో సమావేశం నిర్వహించి రూ. 49 వేల కోట్లు అవసరమని తెలుసుకున్న తర్వాత, తప్పించుకునేందుకు రేవంత్ తెలివితేటలు ప్రదర్శిస్తున్నాడని కేటీఆర్ విమర్శించారు.
రెవంత్ రెడ్డి సచివాలయంలో లంకె బిందెలు ఉంటాయని చెప్పినా, అవి లేవు. ఆయన రుణమాఫీకి కేవలం రూ. 26 వేల కోట్లు మాత్రమే కేటాయించారని పేర్కొన్నారు. సబితా ఇంద్రారెడ్డిపై అవమానకర వ్యాఖ్యలు చేసి, రేవంత్ తనకు పాలన చేతకావడం తేటతెల్లం చేశాడు. సబితక్క నాలుగున్నర గంటలు నిలబడి మాట్లాడినప్పటికీ, రేవంత్ ఆమెకు మైక్ ఇవ్వకుండా అడ్డుకున్నారని కేటీఆర్ తెలిపారు.
రైతు రుణమాఫీ పూర్తయ్యే వరకు బీఆర్ఎస్ తమ పోరాటాన్ని ఆపదు. రుణమాఫీ విషయంలో 49 వేల కోట్ల నుంచి రూ. 7500 కోట్లకు తగ్గించడం, రైతుల పట్ల కాంగ్రెస్ అవమానం. రైతన్నలు ఈ మోసాన్ని గుర్తించి, కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించాలి అని కేటీఆర్ స్పష్టం చేశారు.
రేవంత్ అన్ని ప్రాజెక్టులను రద్దు చేసి ప్రజలను ఆగం చేస్తున్నారు. బీఆర్ఎస్ అంటే భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు, భారత రైతు సమితి కూడా. రైతులందరికీ రుణమాఫీ జరిగే వరకు పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు.
రుణమాఫీ మాత్రమే కాదు, రేవంత్ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై కూడా మేము అంచనాలు వేసి, ప్రజలను మోసం చేయకుండా వారి హక్కుల కోసం పోరాడుతాం. మేము బజారు భాష మాట్లాడాల్సిన అవసరం లేనిదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
“కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు ఆనందంగా ఉండేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన హామీలను అమలు చేసేంతవరకు, ప్రభుత్వాన్ని నిలదీస్తాం,” అని కేటీఆర్ రైతులకు ధైర్యం ఇచ్చారు.