-ప్రత్యేక హోదా ముగిసిపోయిన అంశం
-కేంద్ర సహాయమంత్రి శ్రీనివాసవర్మ వ్యాఖ్యలు
అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ఉక్కు, పరిశ్రమల శాఖ సహాయమంత్రి శ్రీనివాసవర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ఏపీ ప్రజలకు సెంటిమెంట్ తో కూడుకున్నదని, ప్రైవేటీకరణ అంశంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతానని తెలిపారు. ప్రజలకు మేలు జరిగేలా అడుగులు వేస్తామని వివరించారు. ప్రత్యేక హోదా ముగిసిపోయిన అంశంగా పేర్కొన్న ఆయన ఏపీకి కేంద్రం స్పెషల్ ప్యాకేజీ ఇచ్చిందని గుర్తుచేశారు. రాబోయే ఐదేళ్లు కూటమితో కలిసి ముందుకెళతామని ఆయన స్పష్టం చేశారు.