నాలుగు నెలల ప్రభుత్వాన్ని పడగొడతారా?

పదేళ్లు ఉన్న మిమ్మల్ని నడిరోడ్డులో ఉరి తీయాలి
నిరుద్యోగులు చూస్తూ ఊరుకుంటారా…
మోదీ, కేడీ ఇద్దరూ తోడుదొంగలే…వారిని నమ్మొద్దు
ఒకరిని బండకేసి కొట్టారు..ఇంకొకరిని గోడకేసి కొట్టాలి
ఇంద్రవెల్లి అమరుల సాక్షిగా చెబుతున్నా…
ఆదిలాబాద్‌ జన జాతరసభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

ఆదిలాబాద్‌, మహానాడు : ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆదిలాబాద్‌ జన జాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి కేసీఆర్‌, మోదీపై ఫైర్‌ అయ్యారు. సభలో ఆయన మాట్లాడుతూ ప్రజా పాలనలో ఆరు గ్యారంటీల్లో ఐదు అమలు చేస్తున్నాం. త్వరలోనే రూ.2 లక్షల రుణమాఫీ చేయనున్నామని వెల్లడిరచారు. రాంజీ గోండు, కొమురం భీమ్‌ ఈ గడ్డ పౌరుషాన్ని నిరూపిం చారు.. ఇంద్రవెల్లి అమరుల సాక్షిగా ఆ కుటుంబాలను ఆదుకుని స్థూపాన్ని పర్యాటక కేంద్రం గా తీర్చి దిద్దుకుంటున్నాం..నాగోబా జాతరకు కోట్ల రూపాయలు కేటాయించి ఆదివాసీ సంప్రదాయాన్ని గౌరవించుకుంటున్నాం.. కుఫ్టీ ప్రాజెక్టును పూర్తి చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది. కడెం ప్రాజెక్టును మరమ్మతులు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం.. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టును కడతాం.. ఆ ప్రాజెక్టుకు మళ్లీ డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ పేరు పెడతాం..ఆదిలాబాద్‌లో యూనివర్సిటీ ప్రారంభించి మీ చదువులు మీ ప్రాంతంలోనే చదువుకునే అవకాశం కల్పిస్తాం..

ఈ ప్రాంతంలో మూతపడిన సిమెంటు ఫ్యాక్టరీని మళ్లీ తెరిపించి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడిరచారు. హామీలు ఒక్కొక్కటిగా చేస్తుంటే కాంగ్రెస్‌ను ఓడిరచాలని అక్కడ మోదీ..ఇక్కడ కేసీఆర్‌ అంటు న్నారు.. ఇందిరమ్మ ఇండ్లను డబ్బా ఇండ్లు అని చెప్పి డబుల్‌ బెడ్రూం ఇస్తానని కేసీఆర్‌ మోసం చేశారు.. పదేళ్లలో ఈ ప్రాంతంలో ఎవరికైనా డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇచ్చారా? అని ప్రశ్నిం చారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే వారికి రూ.5 లక్షలు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. కాంగ్రెస్‌ను పడగొట్టినా.. ఓడగొట్టినా ఇందిరమ్మ ఇళ్లు ఆగిపోతాయి. గ్యారంటీలు అమలు చేస్తున్న కాంగ్రెస్‌పై మోదీ, కేసీఆర్‌ కక్షగట్టి ఓడిరచాలని చూస్తున్నారు. వందరోజుల మా ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారు… మరి పదేళ్లు ఉన్న వాళ్ల ని నడి బజార్లో ఉరి తీయాలా? అని ప్రశ్నించారు. పదేళ్లు కేసీఆర్‌ ఉద్యోగాలు ఇవ్వలేదు.. కానీ మా ప్రభుత్వం మూడు నెలల్లో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసింది…మా ప్రభుత్వాన్ని పడగొడతా మంటే నిరుద్యోగులు చూస్తూ ఊరుకుంటారా? అని హెచ్చరించారు. డిసెంబరులో కేసీఆర్‌ను బండకేసి కొట్టారు… రేపు మోదీని కూడా గోడకేసి కొట్టాలి..బీజేపీని ఓడిరచాలని పిలుపునిచ్చా రు. మోదీ కుంచిత స్వభావంతో నిధులన్నీ గుజరాత్‌కు తీసుకెళ్లారు.. పదేళ్లు కేసీఆర్‌ను చూశా రు.. పదేళ్లు మోదీని చూశారు… ఇక మీ సంక్షేమం కోరే ఇందిరమ్మ రాజ్యాన్ని ఆశీర్వదించం డి.. ఆదిలాబాద్‌లో ఆత్రం సుగుణను గెలిపించాలని పిలుపునిచ్చారు.