బెయిల్‌పై ఉన్న వారు దేశాన్ని ఉద్ధరిస్తారా?

రేవంత్‌, రాహుల్‌పై బీజేపీ నేత ప్రభాకర్‌

హైదరాబాద్‌, మహానాడు: ఇండీ కూటమికి సంబంధించిన స్టార్‌ క్యాంపెయినర్లు వివిధ రకాల కేసుల్లో (ఆర్థిక నేరాలు, ఏసీబీ, మనీలాం డరింగ్‌, పరువునష్టం దావా కేసులు) శిక్షపడి జైలులో ఉన్నారు. లేదా వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్‌ మీద బయటకు వచ్చి ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు. వీళ్లా ప్రజలకు గ్యారంటీ ఇచ్చేదని రాహుల్‌ గాంధీ, రేవంత్‌ రెడ్డిని ఉద్దేశించి బీజేపీ నేత ఎన్‌.వి.ఎస్‌.ఎస్‌.ప్రభాకర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం లో శనివారం మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీలు వివిధ కేసు ల్లో బెయిల్‌పై బయట తిరుగుతున్నారని, వారు ప్రజలకు గ్యారంటీలు ఇవ్వడం సిగ్గుచేటన్నారు. జస్టిస్‌ వెంక టాచలయ్య కమిషన్‌ వేసింది భారత రాజ్యాంగాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడం కోసమని, రిజర్వేషన్ల రద్దు కోసం వేసిన కమిషన్‌ ఎంత మాత్రం కాదన్నారు. వెంకటాచలయ్య కమిషన్‌ ఎందుకు వేశారో చదివి తెలుసుకోవాలని హితవుపలికారు.