– మంత్రి లోకేష్
విశాఖపట్నం, మహానాడు: ఇక్కడి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కార్యాలయంలో విద్య, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ శుక్రవారం ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుండి లోకేష్ ను కలిసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు, కార్యకర్తలు, నాయకులు చేరుకున్నారు. అందరినీ ఆప్యాయంగా పలకరించి ఫోటోలు దిగిన మంత్రి… అందరి సమస్యలు వింటూ వారి నుండి విజ్ఞప్తులు స్వీకరించారు. సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.