Mahanaadu-Logo-PNG-Large

రౌడీ అవుతారా..మంచి సిటిజన్‌ అవుతారా?

-చిన్న గొడవ జరిగినా జైలుకు పంపిస్తాం
-సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు వద్దు
-బెట్టింగ్‌తో జీవితాలు నాశనం చేసుకోవద్దు
-కౌంటింగ్‌ నేపథ్యంలో ఎస్పీ మల్లికా గార్గ్‌ సూచనలు

వినుకొండ : పట్టణంలో పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికాగార్గ్‌ గురువారం పట్టణ ప్రజలతో సమావేశమయ్యారు. ఎన్నికల సమయంలో అల్లర్లు జరిగాయి. ఎన్నికల సంఘం రిపోర్టు తీసుకుంది. ఐరన్‌ రాడ్‌తో తిరుగుతారు ఆంటే ఇది మంచిది కాదు. కౌంటింగ్‌ సందర్భంగా ప్రశాంత వాతావరణానికి సహకరించాలని కోరా రు. వినుకొండలో బెట్టింగ్‌ కాస్తున్నారని విన్నానని, జీవితాలు నాశనం చేసుకోద్దని సూచించారు. పల్నాడు జిల్లాలో చిన్న గొడవ జరిగినా కేసులు ఉంటాయి..జైలుకు పోవలసిందేనని తెలిపారు. రౌడీ అవ్వాలా..మంచి సిటిజన్‌ అవ్వాలా? మీ ఇంట్లో కూర్చుని ఆలోచించాలని కోరారు. 144 సెక్షన్‌ అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సోషల్‌ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే జైలుకు పంపిస్తామని తెలిపారు.