టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి లుక్కా
విజయవాడ, మహానాడు : కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి, మచిలీపట్నం పరిశీలకులు లుక్కా సాయిరాం ప్రసాద్ గౌడ్ పిలుపునిచ్చారు. టీడీపీ కార్యాల యంలో మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఐదేళ్లలో జగన్ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశాడని దుయ్యబట్టారు. అన్ని వర్గాల ప్రజలు కోలుకోలేని విధంగా నష్టపోయారన్నారు. పేర్ని నాని మంత్రిగా నియోజవర్గానికి చేసింది శూన్యమన్నారు. ఆయన అవినీతి సంపాదనతో ప్రజలను కొనుక్కోవాలని చూస్తున్నాడన్నారు. కొల్లు రవీంద్ర నియో జకవర్గంలో సిమెంట్ రోడ్లు, పోర్టు నిర్మాణానికి సరిపోయే భూములను సమీకరించిన ఘనత దక్కుతుందన్నారు. 24న కొల్లు రవీంద్ర నామినేషన్‌కు భారీఎత్తున తరలిరావాలని కోరారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా బీసీ గౌడ్ సాధికారిక కన్వీనర్ పామర్తి కిషోర్‌బాబు పాల్గొన్నారు.