-వెయ్యికోట్లు ఖర్చు చేసినా భంగపాటు తప్పలేదు
-బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్: దేశవ్యాప్తంతో పాటు తెలంగాణలోనూ కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మ లేదు. రిజర్వేషన్ల అంశం పేరుతో ఫేక్ వీడియోలతో చేసిన కుట్రలను తిప్పికొ ట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయం బీజేపీ విజయం, మోదీ విజయం. ఆరు నెలల్లోనే రేవంత్ ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం పోయిందని తేలింది. పార్లమెంట్ ఎన్నికలు రెఫరెండం అన్న సీఎం ఇప్పుడు ఏమంటారని బీజేపీ శాసనసభాపక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలోనూ ఎన్ని జిమ్మిక్కులు చేసిన వారి చెప్పిన సీట్లు కంటే తక్కువే గెలిచారని తెలిపారు. 14 సీట్లు గెలుస్తామన్నారు..ఇప్పుడు 8 సీట్లకే వారిని ప్రజలు పరిమితం చేశారు. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై ఆరు నెలల్లోనే ప్రజలకు విశ్వాసం పోయిందని తేలిందన్నారు. 16 సీట్లలో కాంగ్రెస్ దాదాపు వెయ్యి కోట్ల వరకు ఖర్చు చేసినప్పటికీ భంగపాటు తప్పలేదన్నారు, ఈ ఎన్నికల్లో 35శాతం ఓటు బ్యాంకు అందించిన రాష్ట్ర ప్రజలందరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.