రంగు మారినా బుద్ధి మారని సాక్షి మీడియా

హూ కిల్డ్ బాబాయ్ అన్నది అందరికీ తెలుసు… సీబీఐకి తప్ప!
హంతకులు నడిపే పార్టీకి ఓటు వేయవద్దన్న డాక్టర్ సునీతా రెడ్డి
తండ్రి హత్యపై న్యాయం కోరుతూ ప్రజా కోర్టును ఆశ్రయించిన పట్టువదలని వైయస్ వివేకా తనయ

బీసీలు అంటే అంత చులకనా జగన్మోహన్ రెడ్డి
బీసీ మహిళకు టికెట్ అన్నా వు… ఇప్పుడు మళ్లీ ఈ బేరసారాలు ఏంటి?
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

హూ కిల్డ్ బాబాయ్ అన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్న నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు, ఒక్క సీబీఐ కి తప్ప అంటూ ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో అందరికీ తెలిసినప్పటికీ, అందరూ నటిస్తూనే ఉన్నారు. నటనలో జీవిస్తున్నారని విమర్శించారు. శుక్రవారం రచ్చబండ కార్యక్రమం లో భాగంగా రఘురామ కృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… హంతకులు రన్ చేసే పార్టీకి ఓటు వేయొద్దని వైయస్ వివేకానంద రెడ్డి ని ఎవరు చంపారో డాక్టర్ వైఎస్ సునీతా రెడ్డి చెప్పకనే చెప్పారన్నారు.

అలాగే నేను కూడా ఫలానా వ్యక్తి హత్య చేశారని చెప్పను. డిప్లమోసి అనేది ఉండాలి కదా అంటూ ఎదురు ప్రశ్నించారు. కేసు విచారణ జరుగుతుంటే ఎలా వివరాలు చెబుతారని గతంలో నాపై ఈ దరిద్రులు కేసు పెట్టారని ఆయన మండిపడ్డారు. వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమేనని పేర్కొన్న రఘురామకృష్ణంరాజు, ఎవడు ఎవడికి చెప్పి వేయమంటే, వాడు ఎవడికి చెప్పాడో, వాడు ఎవరికీ సుపారి కిల్లింగ్ ఆర్డర్ ఇచ్చాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పై ఇప్పటివరకు న్యాయస్థానాలలో పోరాడిన డాక్టర్ వైఎస్ సునీతా రెడ్డి, ఇప్పుడు ప్రజా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తోందన్నారు.

ప్రజలు ఇటీవల డబ్బులకు లొంగిపోతున్నారు. అయినా, ఇంకా వారిలో మంచితనం బ్రతికే ఉందేమో… వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పై తీర్పు కోరడం ద్వారా వారిని పరీక్షించాలన్నారు. వైయస్ వివేకానంద రెడ్డిని ఎవరు వేశారో… ఎందుకు వేశారో అందరికీ తెలిసినప్పటికీ తెలియనట్టే ప్రజలు కూడా నటిస్తున్నారన్నారు. మా చిన్నాన్న ను చంపేశారని గతంలో బావురుమన్న జగన్మోహన్ రెడ్డి , స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సిబిఐ విచారణ ఎదుర్కోవాలని రఘురామ కృష్ణంరాజు డిమాండ్ చేశారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజున హైదరాబాదులోని లోటస్ పాండ్ కు ఐదున్నర గంటలకు వచ్చిన ఫోను ఏడు గంటలకు వచ్చినట్లుగా ఎందుకు నాటకాలను ఆడారని ప్రశ్నించారు.

ఐదున్నర గంటలకే ఫోన్ వచ్చినట్లుగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం రెడ్డి సిబిఐ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలం ఆడియో కోర్టు వద్ద సజీవ సాక్ష్యం గా ఉందన్నారు. ఫోన్ రిసీవ్ చేసుకున్నది ఎవరు?, పైకి రమ్మని పిలిచినది ఎవరు??, ఐదున్నర గంటలకు వచ్చిన ఫోను ను, ఏడు గంటలకు వచ్చిందని చెబితే కుదరదు. ఆ ఫోన్ వచ్చిన తర్వాత కిందకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎవరెవరికి ఫోన్ చేశారో వాటి వివరాలన్నీ ఉన్నాయని, సరైన సమయంలో అవన్నీ బయటకు వస్తాయన్నారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ అటు సుప్రీంకోర్టులో, ఇటు హైకోర్టులో పెండింగ్ లో ఉండగా, సిబిఐ అధికారులు ఒకవైపు ఈ కేసు విచారణ కొనసాగించాల్సిందేనట్టు, మరొకవైపు సుప్రీంకోర్టు ఆదేశిస్తేనే ముందుకు వెళ్తామని చెప్పడం ఆశ్చర్యంగా ఉంది.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న దస్తగిరి పై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు కేసులను బనాయించి జైల్లో నిర్బంధించింది. జైల్లో ఉన్న దస్తగిరిని వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సహా నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న శివశంకర్ రెడ్డి తనయుడు, జైల్లో కలిసి 20 కోట్ల రూపాయల డబ్బు ముట్ట చెబుతామని, సిబిఐ అధికారి రాంసింగ్ వేధింపులు భరించలేక 164 స్టేట్మెంట్ ఇచ్చానని చెప్పాలంటూ ఒత్తిడి చేశారు. శివశంకర్ రెడ్డికి ఈ హత్యతో అసలు సంబంధమే లేదని చెప్పమని కోరగా, దానికి దస్తగిరి నిరాకరించారు.. ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులు సునీతా రెడ్డి దృష్టికి తీసుకురాగా, కేసును నిర్వీర్యం చేసేందుకు ఇటువంటి కుట్రలు కూడా జరుగుతున్నాయని ఆమె అంగీకరించారన్నారు.

ఇప్పటికే 11 సిబిఐ కేసులు ఉన్నాయి… 12వ కేసు నమోదవుతుందని జగన్మోహన్ రెడ్డి ఎందుకు అన్నారో విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలి

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణను సిబిఐకి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆయన సోదరి డాక్టర్ వైయస్ సునీతా రెడ్డి కలిసినప్పుడు కేసు విచారణ కోసం సిబిఐ కి వెళ్తే ఇప్పటికే నా పైన 11 కేసులు ఉన్నాయి. ఇది 12వ కేసు అవుతుంది. అవినాష్ రెడ్డి బిజెపిలో చేరుతాడని ఎందుకు అన్నారో విజ్ఞులైన ప్రజలు ఆలోచించాలని రఘురామకృష్ణం రాజు కోరారు. ఇప్పటికే నాపై 11 కేసులు ఉన్నాయని, ఇది 12వ కేసు అవుతుందని జగన్మోహన్ రెడ్డి అన్నారంటే బై మిస్టేక్ ఆయన అంతరాత్మ నిజం పలికిందన్నమాట. సిబిఐ విచారణ కోరాలని అడిగితే, తనపై మరొక కేసు అవుతుందని అనాల్సిన అవసరం ఏమొచ్చింది చెప్మా? అంటూ ప్రశ్నించారు.

అవినాష్ రెడ్డి బిజెపిలోకి వెళ్తారని అన్నారంటే, అవినాష్ రెడ్డి ద్వారానే ఈ హత్య చేయించినట్టు చెప్పకనే చెప్పారా? అని నిలదీశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి సమాధానంతో, డాక్టర్ వైఎస్ సునీతా రెడ్డికి అనుమానం వచ్చినప్పటికీ ఆమె బయట పడలేదు. సిబిఐ విచారణ కోసం హైకోర్టును ఆశ్రయించింది. జగన్మోహన్ రెడ్డి అభిష్టానికి భిన్నంగా హైకోర్టు కేసు విచారణను సిబిఐ కి అప్పగించింది. సిబిఐ అధికారులు కేసు విచారణ ప్రారంభించి ఒక దశకు తీసుకువచ్చిన సమయంలో విచారణ అధికారిని మార్చారు. విచారణ అధికారిగా రామ్ సింగ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కేసు పురోగతి అశ్వ వేగాన్ని పుంజుకుంది. కేసువిచారణ ఇదే స్పీడ్ తో కొనసాగితే కూసాలు కదిలిపోవడమే కాకుండా , పైదాకా వస్తుందని భావించి, ఆయన్ని క్యాష్ తో మేనేజ్ చేయాలని చూశారు.

రామ్ సింగ్ ఎటువంటి ప్రలోభాలకు లొంగక పోవడంతో, ఆయనపై రివర్స్ లో చెత్త కేసులను పెట్టి భయపెట్టాలని చూశారు. సిబిఐ డిసెంబర్ 21వ తేదీన పలాయనం చిత్తగించి జనవరి 22వ తేదీ వరకు కేసు విచారణ పురోగతి సాధించలేకపోయింది. దీనితో పట్టు వదలని విక్రమార్క లాగా డాక్టర్ సునీతా రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించి, కేసు విచారణను హైదరాబాదుకు మార్చాలని కోరారు. కేసు విచారణను హైదరాబాదుకు మార్చడానికి సుప్రీంకోర్టు అంగీకరించడంతో మళ్లీ కేసు విచారణ ఊపందుకుంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా వైఎస్ భాస్కర్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేసింది.

చార్జిషీట్లో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేరును కూడా చేర్చింది. వైఎస్ భాస్కర్ రెడ్డి పైన మోపిన అభియోగాలనే వైయస్ అవినాష్ రెడ్డి పై కూడా మోపినప్పటికీ ఆయన్ని అరెస్టు చేయలేదు. ఒకే రకమైన అభియోగాలను ఎదుర్కొన్న వైయస్ భాస్కర్ రెడ్డి, శివ శంకర్ రెడ్డి లను అరెస్టు చేసినప్పటికీ, వైయస్ అవినాష్ రెడ్డి ని అరెస్టు చేయడానికి సిబిఐ వెనుకంజ వేసింది. హత్య గురించి దస్తగిరి చెప్పిన వివరాలను, గూగుల్ టేక్ అవుట్ ఆధారాలతో పోల్చి చూసుకున్న సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా, ఆయనతో వలపు యుద్ధాన్ని చేశారని రఘురామకృష్ణంరాజు ఫైర్ అయ్యారు. అవినాష్ రెడ్డి కడపలో ఉన్న సమయంలో ఆయన అరెస్ట్ కు సహకరించాలని కడప ఎస్పీని సిబిఐ అధికారులు కోరగా, కష్టమని ఆయన తేల్చేశాడు.

అంతలోనే అవినాష్ రెడ్డి తల్లి అనారోగ్యం బారిన పడటం, హైదరాబాదుకు తరలించే లో గాని ఆమెకు ఏమైనా జరగవచ్చునని, కర్నూలులోని ఒక చిన్న ఆసుపత్రిలో ఉంచి చికిత్స చేయించారు. అవినాష్ రెడ్డి పెద్ద నాయకుడని ఆయన్ని అరెస్టు చేస్తే, రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయని అప్పటి కర్నూలు ఎస్పీ పేర్కొనడంతో సీబీఐ అధికారులు కూడా చేతులెత్తేశారు.

యోధాను యోధుల్ని అరెస్టు చేసిన సీబీఐ, ఆఖరికి జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్టు చేసిన సిబిఐ, అవినాష్ రెడ్డిని అరెస్టు చేయడంలో పూర్తిగా విఫలమయింది. ఆస్పత్రి చుట్టూ పులివెందుల, కర్నూలు జిల్లా కు చెందిన కొందరి పహార మధ్య అవినాష్ రెడ్డిఅరెస్టు నుంచి తప్పించుకున్నారు. కోర్టు బెయిల్ ఇవ్వగానే ఆయన సేఫ్ అయ్యాడు. తల్లి ఆసుపత్రి నుంచి లేచి ఇంటికి వెళ్ళింది. అప్పటినుంచి కేసును విచారించిందే లేదు.