Mahanaadu-Logo-PNG-Large

సీఎం చంద్రబాబుకు రాఖీలు కట్టిన మహిళా నేతలు, బ్రహ్మ కుమారీలు

అమరావతి : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మహిళా నేతలు, బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా సోమవారం ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి పార్టీ మహిళా నేతలు మాజీ మంత్రి పీతల సుజాత, జడ్పీ మాజీ ఛైర్ పర్సన్ గద్దె అనురాధ, టీడీపీ డ్వాక్రా-అంగన్వాడీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత, కంభంపాటి శిరీష, పలువురు బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా సీఎం వారికి ధన్యవాదాలు తెలిపి శుభాకాంక్షలు తెలిపారు.