దాడులపై మహిళా కమిషన్‌ సీరియస్‌

చికిత్స పొందుతున్న తల్లి, కుమార్తెకు పరామర్శ
నిందితుడిని అరెస్టు చేయాలని ఎస్పీకి ఆదేశం
వరుస ఘటనలపై ఈసీ ఆంక్షలు సరికాదని వ్యాఖ్య

నెల్లూరు, మహానాడు : వింజమూరులో ఆకతాయి దాడిలో గాయపడి నెల్లూరు ఆసుపత్రిలో చికిత్స పొం దుతున్న తల్లి, కుమార్తెను శనివారం మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ గజ్జల వెంక టలక్ష్మి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీతో మాట్లాడినట్లు వివరించారు. వింజమూరులో కొంతకాలంగా యువతిని ప్రేమిస్తున్నానంటూ నాగరాజు కొంతకాలంగా వేధిస్తున్నాడని, ఈ నేపథ్యంలో శుక్రవారం యువతితో పాటు ఆమె తల్లిపై దాడి చేసినట్లు తెలిపా రు. వారికి ప్రాణభయం ఉందని భద్రత కల్పిస్తామని ఎస్పీ వెల్లడిరచారు. పరారీలో ఉన్న నిందితుడిని త్వరగా పట్టుకోవాలని, శిక్ష పడేలా చర్యలు చేప ట్టాలని ఎస్పీకి సూచించినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన తర్వాతే మహిళపై దాడులు పెరిగాయని, వరుస సంఘటనపై మహిళా కమిషన్‌ చర్యలు చేపట్టకుండా ఈసీ ఆంక్షలు విధించడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. బాధితులకు మహిళా కమిషన్‌, ప్రభుత్వం అండగా ఉండి రక్షణ కల్పిస్తుందని తెలిపారు. మెరుగైన వైద్యం అందించాలని, అనంతరం ప్రభుత్వ షెల్టర్‌ హోమ్‌కు తరలించాలని అధికారులకు సూచించారు.