కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకుందాం
నరసరావుపేట టీడీపీ అభ్యర్థి చదలవాడ పిలుపు
పల్నాడు జిల్లా నరసరావుపేట, మహానాడు : నరసరావుపేట టీడీపీ కార్యాలయంలో మహాశక్తి ప్రతినిధులతో మంగళవారం టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా శక్తిని మహాశక్తిగా గుర్తించిన ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమేనని తెలిపారు. నాడు ఎన్టీఆర్ మహిళలకు విద్యలో రిజర్వేషన్లు, ప్రత్యేక యూనివర్శిటీ, ఆస్తిలో వాటా కల్పించారు. చంద్రబాబు వచ్చాక రాజకీయాల్లో రిజర్వేషన్లు ఇచ్చారు. మహిళల పొదుపు కుటుంబానికి అండగా ఉండే లక్ష్యంతో డ్వాక్రా స్థాపించారు. దీపం పథకంతో ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చి పొగ రహిత వంటిల్లు సాకారం చేశారు.
ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలతో మహిళల జీవితాల్లో వెలుగులు నింపేలా ప్రణాళిక రూపొందించారు. ఆడబిడ్డ నిధి, తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లతో మహిళలకు అండగా నిలిచారు. కలలకు రెక్కలు ద్వారా విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ఎదిగేందుకు తోడ్పాటు అందించబోతున్నారు. మహిళా సాధి కారత చంద్రబాబుతోనే సాధ్యమని, కూటమిని గెలిపించాలని కోరారు.