Mahanaadu-Logo-PNG-Large

అరాచకాలు సృష్టించిన వారి సంగతి తేలుస్తా!

మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి   
 
మాచర్ల , మహానాడు : మాచర్ల లో అరాచకాలు సృష్టించిన పిన్నెల్లి అనుచరుల సంగతి తెలుస్తా, వాళ్ళు కూడా నెల్లూరు జైలుకు వెళ్లి పిన్నెల్లి తో గడుపుతారని మాచర్ల ఎమ్యెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి  అన్నారు. మాచర్ల టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ..  నేరస్తుడు పిన్నెల్లిని కాపాడటానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జైలుకి వెళ్ళడం సిగ్గు చేటు అన్నారు.  ఓ దొంగకు, దోపిడీ దారుడికి, రౌడీకి అన్యాయం జరిగిందని జగన్ అల్లాడిపోతున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో హత్యలు, అత్యాచారాలు, బడుగు బలహీన వర్గాలపై దాడులు చేస్తే జగన్ మోహన్ రెడ్డి ఎందుకు స్పందించలేదన్నారు. జగన్ స్వప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని నాశనం చేశాడన్నారు. పరామర్శ పేరుతో కత్తులు, కటారులు,రాడ్లతో పిన్నెల్లి కారంపూడి వెళ్లి దాడులకు పాల్పడ్డాడు. పిన్నెల్లి అరాచకాలు, దోపిడీ పై చర్చకు మేము సిద్ధం, మా సవాళ్లు స్వీకరించడానికి మీరు సిద్ధమా..  మీ పిన్నెల్లి ఎంత ఆరాచకుడో మాచర్ల నడిబొడ్డులో చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. మీలాగే మేము చేయాలనుకుంటే ఒక్క వైసీపీ నాయకుడు రాష్ట్రంలో ఉండరు.  సీఎం చంద్రబాబు దయతోనే, భిక్షతోనే మీ పార్టీ నాయకులు స్వేచ్చగా తిరుగుతున్నారన్నారు. మాచర్ల టీడీపీ కార్యాలయాన్ని తగులబెడితే అధికారులు పట్టించుకోలేదని వాపోయారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట తెదేపా నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.