గుంటూరు పశ్చిమ కార్యకర్తలతో పెమ్మసాని చంద్రశేఖర్
గుంటూరు, మహానాడు : విజయమే లక్ష్యంగా 26 డివిజన్లలోనూ టీడీపీ కార్యకర్తలు, నాయకులు కలిసి పనిచేయా లని, కష్టపడి పనిచేసిన ప్రతిఒక్కరికీ న్యాయం చేసే బాధ్యత తమదని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు టీడీపీ పార్లమెంటరీ కార్యాలయంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ ఎన్నికల తర్వాత ఏయే డివిజన్లలో ఏ కార్యకర్త ఏ స్థాయిలో కష్టపడ్డారో స్వయంగా తెలుసుకుంటానని, వారికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు.
ఎంపీగా తనకు, ఎమ్మెల్యేగా పిడుగురాళ్ల మాధవికి మెజారిటీ వచ్చేలా కృషిచేయాలని సూచించారు. ప్రచార కార్యక్రమాల్లో అధికారులతో ఏ సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజ కవర్గం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి, పశ్చిమ నియోజకవర్గం నాయకులు కోవెలమూడి రవీంద్రబాబు (నాని), కార్పొరేటర్లు ఈరంటి వరప్రసాద్, వేములపల్లి శ్రీరాం ప్రసాద్, కొమ్మినేని కోటేశ్వరరావు తదితర నాయకులు పాల్గొన్నారు.