సమన్వయంతో గెలుపు కోసం కృషిచేయాలి

22న నామినేషన్‌ను జయప్రదం చేయాలి
సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ
రూరల్‌ మండల కార్యకర్తలతో సమీక్ష

పల్నాడు జిల్లా సత్తెనపల్లి, మహానాడు : రాబోయే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేయాలని నాయకులు, కార్యకర్తలకు సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి పిలుపునిచ్చారు. సత్తెనపల్లి రూరల్‌ మండల విస్తృతస్థాయి సమావేశం శుక్రవారం పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా కన్నా మాట్లాడారు. తన నామినేషన్‌ ప్రక్రియకు అందరూ సమాయత్తం కావాలని కోరారు. రాబోయే ఎన్నికల కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని, అలా గే ప్రతి బూత్‌ ఇన్‌చార్జి, ప్రతి నాయకుడు గ్రామంలో అందరినీ సమన్వయం చేసుకోవాలని సూచిం చారు. ప్రతి గడప గడప గడపకు సూపర్‌ సిక్స్‌ పథకాలు వివరించి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఏం అభివృద్ధి చేస్తామో చెప్పాలని వివరించారు. గత ప్రభుత్వంలో ప్రజల సంక్షేమం పేరుతో ఎంత సొమ్ము దోచుకున్నారో ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ నెల 22న తన నామినేషన్‌కు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలిరావాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.