తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలం, బలగం

– ఎమ్మెల్యే గళ్ళా మాధవి

గుంటూరు, మహానాడు: తెలుగుదేశం పార్టీ(టీడీపీ)కి కార్యకర్తలే బలం, బలగమని, అన్న నందమూరి తారక రామారావు పార్టీని స్థాపించినప్పుడు కార్యకర్తలే ప్రచార సాధకులుగా మారి తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చారని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. పశ్చిమ నియోజకవర్గం లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆమె శనివారం ప్రారంభించి, మాట్లాడారు. పార్టీ కార్యకర్త అంటే కష్ట కాలంలో అండగా నిలిచేవాడని తమ భావిస్తున్నామని అటువంటి కార్యకర్తకు ఆర్థికంగా, విద్య, వైద్య పరంగా ఆదుకోవాలని వారి కుటుంబానికి బాసటగా నిలవాలన్న ఆలోచనతో కార్యకర్తల సంక్షేమం నిధిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ ఏర్పాటు చేశారని తెలిపారు.

ఈ సభ్యత్వానికి 100 రూ.లు సంవత్సర కాలపు పరిమితి, లక్ష రూపాయల తో శాశ్వత సభ్యత్వాన్ని తీసుకుంటే జీవిత కాలం ఉంటుందని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గంలో అత్యధిక సభ్యత్వాలు చేసి రాష్ట్రంలోనే టాప్ టెన్ లో ఒకటిగా నిలిపేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే ధీమా వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో మద్దిరాల మ్యాని, తెలగతోటి సుధీర్, మార్క్, చింతకాయల వెంకట సాయి, తదితరులు పాల్గొన్నారు.