హైదరాబాద్, మహానాడు: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో బుధవారం అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డిపల్లెకు చెందిన జవాన్ యాదయ్య కుటుంబసభ్యులు కలిశారు. గతంలో దుండ గుల కాల్పుల్లో మరణించిన జవాన్ యాదయ్య భార్య సుమతమ్మకు ఇటీవల ఉద్యోగంతో పాటు కుటుంబానికి ఐదెకరాల భూమిని కేటాయించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని జవాన్ యాదయ్య కుటుంబసభ్యులు కలిసి కృతజ్ఞతలు తెలిపారు.