యర్రగొండపాలెం గురుకులాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన టీడీపీ ఇంచార్జ్!

యర్రగొండపాలెం, మహానాడు: యర్రగొండపాలెం పట్టణంలోని గురుకుల పాఠశాలను యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆదివారం మీడియాలో ప్రచురించిన కథనాలకు స్పందించి, నిజనిర్ధారణ కోసం ఆయన పూనుకొన్నారు. సంఘటనపై విద్యార్థులు, వార్డెన్, ప్రిన్సిపాల్, వాచ్ మెన్, ఉపాధ్యాయులతో మాట్లాడి తెలుసుకున్నారు.

ఓ వైసీపీ మీడియా ప్రతినిధి వార్డెన్ కి డబ్బు అడగటంతో సయోధ్యకు రాని వార్డెన్ పై అబద్దపు నింద వేయాలనే ఉద్దేశంతోనే ఆ విలేకరి పిల్లలకు ఈ విధంగా చేయమని ఆదేశించాడని విద్యార్థులు తెలిపారు. ఇంకా… ఆ సమయంలో ఇద్దరే వంట మనుషులు అందుబాటులో ఉండటంతో చిన్నపిల్లల ఆకలి దృష్టిలో ఉంచుకుని పాఠశాలలోని ఏడుగురు తొమ్మిదో తరగతి విద్యార్థులు తామే స్వచ్చందంగా చపాతీలు చేసేందుకు ముందుకు వచ్చామని తెలిపారు.

టీడీపీ ప్రభుత్వంపై నిందలు మోపడమే పనిగా యర్రగొండపాలెం ఎమ్మెల్యే వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు. మొన్న గుర్రపుశాలలో జరిగిన ఘటనపై ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ… రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి టీడీపీ వారి దాడిలో గాయపడటం అని చెప్పటం తాటిపర్తి కి సిగ్గుచేటని తెలిపారు. అదే విధంగా చాట్లమడలో జరిగిన అన్నదమ్ముల గొడవను టీడీపీ కి ఆపొదించడం హేయమైన చర్యగా విమర్శించారు. తాటిపర్తి చంద్రశేఖర్ టీడీపీపై ఎన్ని అబద్దాలు మోపిన నిజానిజాలను ఎప్పటికి దాచలేరని అన్నారు. ఇప్పటికైనా ఇలాంటి నీచమైన రాజకీయం మానుకోకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.