-తీవ్రగాయాలు..ఆసుపత్రికి తరలింపు
-పల్నాడు జిల్లాలో ఘటన
గురజాల, మహానాడు: పల్నాడు జిల్లా మాచవరం మండలంలో ఎన్నికల వేళ వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. సోమవారం ఉదయం ఓటు వేసి వెళుతున్న టీవీ 5 రిపోర్టర్ రవీంద్రపై దాడికి పాల్పడ్డారు. రవీంద్ర తన భార్యతో కలిసి ఓటు వేసి వెళుతుండగా ముసుగులు వేసుకుని వచ్చిన వైసీపీ కార్యకర్తలు ఒక్కసారిగా దాడి చేసి గాయపరిచారు. ఆయనకు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.