Mahanaadu-Logo-PNG-Large

పొన్నూరులో వైసీపీ అభ్యర్థి అంబటి మురళీ దౌర్జన్యం

పవన్‌ పర్యటన కోసం ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ ధ్వంసం

పొన్నూరు, మహానాడు:పొన్నూరులో ఆదివారం జరగనున్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పర్యటన కోసం ఏర్పాటు చేసిన హెలీ ప్యాడ్‌ను శనివారం అర్ధరాత్రి వైసీపీ అభ్యర్థి అంబటి మురళీ, అతని అనుచరులు ధ్వంసం చేయించారు. హెలీప్యాడ్‌ ప్రాంతాన్ని కూటమి అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ పరిశీలించారు. ఓటమి భయంతోనే అంబటి మురళీ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇటీవలే సత్తెనపల్లిలో అంబటి మురళీ సాగించిన దోపిడీ, దౌర్జన్యాలని బయటపెట్టారు. హెలీప్యాడ్‌ ధ్వంసంతో తన ముసుగు తీసేసిన అంబటి మురళీ ప్రశాంతమైన పొన్నూరులో ఎన్నికల వేళ విధ్వంసానికి కుట్ర పన్నారని తెలిపారు. పవన్‌ వస్తే తనకు ఘోరమైన ఓటమి తప్పదనే అక్కసుతో ఈ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు.