ఓటమి భయంతో వైసీపీ గ్యాంగ్‌ దాడులు

దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి

ప్రకాశం జిల్లా దర్శి, మహానాడు: రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేందుకు, ఎన్నికలు సజావుగా జరగకుండా ఓటర్లను భయభ్రాంతులను గురిచేసేందుకు వైసీపీ కుట్రలో భాగమే చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లపై రాళ్ల దాడులని దర్శి కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. గాజువాకలో చంద్రబాబు ప్రచార కార్యక్రమంలో రాళ్లతో దాడి చేయడం, తెనాలిలో పవన్‌ కళ్యాణ్‌పై రాళ్ల దాడికి యత్నించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు భంగం కలిగించటమే ఈ కుట్ర లక్ష్యమన్నారు. కోడి కత్తి కథ లాగా విజయవాడ దాడి రక్తి కట్టకపోవడంతో తెలుగుదేశం జనాదరణ చూసి ఓర్వలేక…జగన్‌ బస్సుయాత్ర తుస్సుమనటంతో ఈ కుట్రల కు దిగటం సిగ్గుచేటన్నారు. వెంటనే రాష్ట్ర ఎన్నికల కమిషన్‌, అదేవిధంగా పోలీసు అధికారులు ఈ దాడులపై, హెరిటేజ్‌ పత్రాల దహనంపై సమగ్ర విచారణ జరిపి సంబంధిత అధికారుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎన్ని కుట్రలు చేసినా జగనను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, మరో 40 రోజుల్లో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టంచేశారు.