– బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఫైర్
విజయవాడ, మహానాడు: అవినీతికి, అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ వైసీపీ అంటూ.. జగన్, సజ్జల తీరుపై భారతీయ జనతా పార్టీ(బీజేపీ) భానుప్రకాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఏపీలో కొత్త డ్రామాకు జగన్ తెర లేపారని, అధికారంలో ఉన్న సమయంలో ఎవరినీ కలవకుండా నియంతలా వ్యవహరించారని విమర్శించారు. ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి రాక్షస పాలన, అవినీతి పాలన అని రంకెలు వేస్తున్నారని, గత ఐదేళ్లల్లో జగన్ నువ్వు ఏమి చేశావో చెప్పు… ఇప్పుడు మాట్లాడేదానిలో ఏమైనా అర్థం ఉందా జగన్ అని ఎద్దేవా చేశారు. అవినీతికి, అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ వైసీపీ అయితే, అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ కూటమి ప్రభుత్వమని అన్నారు. ఇంకా… ఆయన ఏమన్నారంటే…
రాష్ట్రంలో పూర్తిగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించింది మీరు. ఐపీసీ సెక్షన్లు తొలగించి.. వైసీపీ సెక్షన్లు అమలు చేసింది మీరు. నేడు చట్టాల గురించి జగన్ మాట్లాడుతుంటే.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. 151స్థానాలు ప్రజలు ఇస్తే.. తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని అరాచకాలు చేశావు జగన్ నువ్వు. కూటమి ప్రభుత్వం పూర్తి పని ప్రారంభించకముందే.. రాష్ట్రపతి పాలన అంటూ జగన్ ఢిల్లీ పరుగెత్తావ్. వికసిత ఏపీ కోసం ఎన్డీయే కష్టపడుతుంటే.. కుట్రలు చేస్తున్నావు. బీజేపీ, టీడీపీ, జనసేనలపై రాక్షసుల్లాగా పడి అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. గతంలో సకలశాఖ మంత్రిగా ఉన్న సజ్జల ఇప్పుడు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. మీ 420 టీం మొత్తాన్ని నడిపించిందే నువ్వే కదా సజ్జల రామకృష్ణారెడ్డీ… ఇంకా సిగ్గు లేకుండా పార్టీ కార్యాలయంపై దాడిని సమర్ధించుకుంటావా?
సజ్జల ఎక్కడ ఉంటే ఏమిటి… ఆదేశాలు ఎక్కడ కూర్చుని అయినా ఇవ్వొచ్చు కదా? ఆరోజు ప్లాన్ ప్రకారం వేరే చోటకి వెళ్లి … ఇప్పుడు అదే సాక్ష్యం అన్నట్లుగా చూపిస్తున్నావు! వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి.. దాడి చేయించింది నువ్వే కదా సజ్జల. సీఎం జగన్ ను నడిపించిందే నువ్వు అనే విషయం అందరికీ తెలుసు.
2019 నుంచి 2024 వరకు మీ హయాంలో నమోదైన ఎఫ్.ఐ.ఆర్ కాపీలు పంపిస్తే.. మీ ప్యాలెస్ మొత్తం మునిగిపోతుంది. వీటిని చదువుకోవాలంటే.. ఐదేళ్లు కాలం కూడా మీరు సరిపోదు. పోలీసులను అడ్డం పెట్టుకుని.. అక్రమంగా పాలన సాగించారు. ముంబై నటి వ్యవహారంలో మీ తప్పు లేకుంటే.. మీ పేర్లే ఎందుకు వచ్చాయి? ముగ్గురు ఐపీయస్ అధికారులు నీ మాటలు నమ్మి.. ఇప్పుడు శిక్ష అనుభవించే పరిస్థితికి వచ్చారు. గత ఐదేళ్లల్లో మీరు ఏపీకి ఏం చేశారో చెప్పే దమ్ముందా? అరాచక ప్రదేశ్ గా, అవినీతి ప్రదేశ్ గా, అంధకార ప్రదేశ్ గా, అప్పుల ప్రదేశ్ గా మార్చిన ఘనత వైసీపిదే. మా ఎన్డీయే ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో పని చేయడం లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది.. ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదు. మేము రామ రాజ్యం కోసం పని చేస్తున్నాం.. మీరు రావణ రాజ్యం కోసం పాలన చేశారు. చివరకు ఇంట్లో ఉండే మహిళా కుటుంబ సభ్యులను కూడా వదలకుండా తిట్టించారు కదా.
అసెంబ్లీలో కూడా బండ బూతులు తిట్టించారు.. అప్పుడు జగన్, సజ్జల ఎందుకు మాట్లాడలేదు? బోరుగడ్డ చేసిన వ్యాఖ్యలపై మీ ఇద్దరు ఎందుకు ఖండించలేదు? ఇప్పుడు అరెస్టులు చేస్తుంటే… గగ్గోలు పెడతారా? మీలాంటోళ్లకు కఠినంగా శిక్షిస్తేనే.. ఇంకోసారి బూతులు తిట్టాలంటే భయపడతారు?
జగన్ పాలనపై కే స్టడీస్ చేస్తే.. ఏవిధంగా రాజకీయ నాయకుడు పని చేయకూడదు… ఏవిధంగా ప్రభుత్వం, ఏ విధంగా పోలీసులు పని చేయకూడదో అర్థమవుతుంది. జగన్ చేసిన పాపాలు ఎవరూ చేయకుండా ఉంటే చాలు.. అదే పాలనకు నిదర్శనం.
120 సజ్జల… గుర్తు పెట్టుకో.. మీ 420 గ్యాంగ్ లను వదిలే ప్రసక్తే లేదు. జగన్ జామానాలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూని అయ్యింది. వరదల వల్ల ప్రజలు అల్లాడుతుంటే.. జగన్ వచ్చి బురద రాజకీయం చేశారు. కోటి రూపాయలు సాయం అన్న జగన్.. ఎవరికి ఇచ్చారో చెప్పాలి.
జగన్ పాలనలో ఏపీ అన్ని విధాలా నాశనం అయ్యింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. అభివృద్ధి పథంలో తీసుకు వెళ్లాలని పని చేస్తున్నారు. ఉద్దేశపూర్వకంగా జగన్ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే.. చూస్తూ ఊరుకోం. ఇక నుంచి నోటికొచ్చినట్టు వాగితే.. చట్టపరంగా చర్యలు తీసుకోక తప్పదు.