– వైసీపీ ది అధికార దాహం
– దేశాభివృద్ధికి బాటలు వేసిన ప్రధాని నరేంద్రమోదీ
– బిజెపి మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం
– బిజెపిలో చేరిన మహిళలు..
విజయవాడ: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికార దాహానికి అంతులేదు.. అంతే కాదు సిద్దం సభలో ముఖ్యమంత్రి మాటలు ఎవరిని వంచించేందుకు అంటూ బిజెపి రాష్ట్ర మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం ప్రశ్నించారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో పాతూరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సిద్దం సభలో వల్లెవేసిన మాటలు అన్నీ ఆయన అధికార దాహానికి తార్కాణం అన్నారు. మద్యపాన నిషేధం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.
రాష్ట్రప్రభుత్వమే లిక్కర్ వ్యాపారం చేసి ప్రజల హఠాన్మరణాలు కారణమైంది. మద్యం వల్ల జీవితాలు చాలించిన వారి విషయంలో ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందన్నారు. చీప్ లిక్కర్ వల్ల మరణాలకు ప్రభుత్వం భాద్యత వహించాలని డిమాండ్ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ స్క్రాబ్ వెళ్ళడం ఖాయమన్నారు. నదీగర్భాలను తోడేసి మరీ ఇసుక ను ప్రభుత్వం బొక్కేసిందన్నారు. వైసీపి మాఫియా రాజ్యంగా మారిపోయిందన్నారు వైసీపిని ఇంటికి సాగనంపడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం లక్షల కోట్లుతో జాతీయ రహదారులు నిర్మాణం చేసిందన్నారు. 33 వేల కోట్లు తో ఆంధ్రప్రదేశ్ లో జాతీయ రహదారులు నిర్మాణం చేసిన ఘనత ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వానిదేనన్నారు. అమరావతి.. బెంగుళూరు జాతీయ రహదారి దక్షిణ భారత దేశంలోనే తొలి హైటెక్నాలజీతో నిర్మాణం చేయడం జరుగుతోందన్నారు. గ్రీన్ ఫీల్డ్ హైవే 14 ప్యాకేజీలు గా విభజించి, 40 ప్రధాన వంతెనలు నిర్మాణం చేసి అత్యంత ఆధునీకరమైన రహదారి నిర్మాణం చేస్తోందన్నారు. అలయన్స్ అంటే వైసీపికి భయమేస్తోందన్నారు. ప్రజలు బిజెపి ప్రభుత్వాన్ని గెలిపించడానికి సిద్దంగా ఉన్నారన్నారు.
తొలుత విజయవాడ వన్ టౌన్ కి చెందిన కొణిజేటి ప్రసన్న లక్ష్మి ఆద్వర్యంలో 100 మంది మహిళలు బిజెపి లో చేరారు. వీరిందరిని ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం, బిజెపి మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం పార్టీలోకి ఆహ్వానించారు