– ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ విమర్శ
సత్తెనపల్లి, మహానాడు: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్బంగా, 100 రోజుల పరిపాలనలో సాధించిన విజయాలను ప్రజలకు వివరించడానికి పల్నాడు జిల్లా, సత్తెనపల్లి నియోజకవర్గం, సత్తెనపల్లి పట్టణం 2వ వార్డులో ఆదివారం జరిగిన ‘ఇది మంచి ప్రభుత్వం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే… విధ్వంసం తప్ప నిర్మాణం తెలియని, గత 5 ఏళ్ళ జగన్ రెడ్డి పాలనలో, అటు రాజధాని, ఇటు పోలవరం, రెండు రివర్స్ అయ్యాయి. పనులు ముందుకు వెళ్ళాల్సింది పోయి, రివర్స్ లో దిగజారాయి. ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్ పనులు లైన్ లో పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇప్పుడు రాజధాని పై ఫోకస్ పెట్టారు. గత 5 ఏళ్ళలో రాజధాని ప్రాంతంలో ఏ పనులు చేయకపోవటంతో, రాజధాని ప్రాంతం మొత్తం పిచ్చి మొక్కలతో నిండిపోయింది.
గత ప్రభుత్వంలో పింఛన్లను అర్హతను బట్టి ఇవ్వకుండా రాజకీయంగా చూసి ఇచ్చారు. ఇప్పుడు అలా ఉండదు. అసలైన అర్హులకు పింఛన్ దక్కే విధంగా గ్రామసభలు పెట్టి న్యాయం చేస్తాం. ఇచ్చిన హామీ మేరకు తొలి నెలలో రూ.7 వేలు పింఛన్ లబ్ధిదారుల ఇంటి వద్దకే పంపిణీ చేశారు. దీపావళికి దీపం పథకం ద్వారా ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఇవ్వబోతున్నారు. సీఎం చంద్రబాబు నీతివంతమైన పరిపాలన చేస్తున్నారు. అందుకే ఇది మంచి ప్రభుత్వమని ప్రజలందరూ కూటమి ప్రభుత్వాన్ని కొనియాడుతున్నారు.
ఈ కార్యక్రమం లో వివిధ హోదాల్లో ని అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.