Mahanaadu-Logo-PNG-Large

విదేశాలకు పారిపోయేందుకు వైసీపీ నేత దేవినేని అవినాష్ ప్లాన్!

– ఛేదించిన మంగళగిరి పోలీసులు

మంగళగిరి, మహానాడు: వివిధ కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ నేత దేవినేని అవినాష్ చివరకు విదేశాలకు పారిపోయేందుకు ప్రణాళిక రచించారు. అయితే, ఈ వ్యవహారాన్ని మంగళగిరి పోలీసులు ఛేదించారు. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి దుబాయ్ పారిపోయేందుకు యత్నించినప్పుడు శంషాబాద్ విమానాశ్రయం అధికారులు మంగళగిరి పోలీసులకు సమాచారమిచ్చారు. అవినాష్ పై కేసులు ఉన్న దృష్ట్యా ప్రయాణానికి అనుమతి ఇవ్వొద్దని పోలీసులు కోరారు. దీంతో అవినాష్‌ శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెనక్కి వెళ్ళిపోయారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్ పై ఎఫ్ఐఆర్ ఉంది. దాడిలో పాల్గొన్న వారిపై పోలీసుల ముందస్తు చర్యలు, లుకౌట్ నోటీసులు జారీ చేసిన విషయం విదితమే.