గుడివాడ, మహానాడు: మహిళలు, తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకుల ఫోటోలు మార్ఫింగ్ చేసినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్న ఇంటూరి రవికిరణ్ అనే వ్యక్తి ని గుడివాడ పోలీసులు అదుపులోకి తీసుకోగా స్టేషన్ బెయిల్ పై బయటకు వచ్చారు. అతని కోసం మాజీ మంత్రి పేర్ని నాని వెళ్ళారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు వారిద్దరిపై కోడిగుడ్లతో దాడి చేసి తరిమి కొట్టారు. ఇటువంటి వారికి ప్రజాకోర్టు లోనే గుణపాఠం నేర్పాలని మహిళలు డిమాండ్ చేశారు.