టీడీపీలో చేరిన వైసీపీ నేత

సత్తెనపల్లి, మహానాడు: రొంపిచర్ల మండలంలో గోగులపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు ఉయ్యాల వెంకట్రావు ఆదివారం టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈ మేరకు సత్తెనపల్లిలో చంద్రబాబు నిర్వహించిన పల్నాడు జిల్లా సమీక్షలో పాల్గొన్న నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవిందబాబు సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అట్లా చిన్నవెంకటరెడ్డి, ముండ్రు శివకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.