• సీఎం చంద్రబాబుకు అర్జీ పెట్టుకుంటే పరిష్కారం లభిస్తుందనే నమ్మకం ప్రజల్లో ఉంది
• అనుభవం ఉన్న నాయకుడిగా సీఎంకు పేరుంది
• స్వయంగా ప్రజల సమస్యలను తెలుసుకునేందుకే గ్రీవెన్స్
• విలేఖర్ల సమావేశంలో మంత్రి సంధ్యారాణి, మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి
మంగళగిరి, మహానాడు: తాడేపల్లి ప్యాలెస్ లో వైసీపీ నాయకులకు ఫేక్ ప్రచారానికి ట్రైనింగ్ ఇస్తున్నారని గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మిలు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి అర్జీ తీసుకుని వస్తే పరిష్కారం దొరుకుతుందనే నమ్మకం ప్రజల్లో ఉందన్నారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు అయితే సీఎం దృష్టికి తీసుకువెళ్లి ఈ రోజు కాకపోయిన నాలుగు, ఐదు రోజుల తరువాత అయిన పరిష్కారం అయ్యే దిశగా అడుగులు వేస్తున్నామని సంధ్యారాణి, పనబాక లక్ష్మి తెలిపారు.
సీఎం చంద్రబాబు స్ఫూర్తితోనే రోజూ గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని, సమస్య పరిష్కారం అయినప్పుడు ప్రజల కళ్లలో ఆనందం కనిపిస్తుందన్నారు. గత ప్రభుత్వం హయాంలో పూర్తిగా స్వాతంత్రం కోల్పోయిన ప్రజలు.. ఈ రోజున స్వాతంత్రం వచ్చిన విధంగా అడుగులు ముందుకు వేస్తున్నారన్నారు. పూర్వం ఏదైన సమస్య అంటే అరెస్టు చేసేవారు. మాస్కు ఇవ్వలేదని ఒక డాక్టర్ ను అరెస్టు చేసిన గత ప్రభుత్వం వారు.. ఈ రోజు ప్రభుత్వ పనితీరును చూసి ఓర్వలేక పనికిరాని విమర్శలు చేస్తున్నారన్నారు. విజయవాడ వరదలు వస్తే… ప్రజలు నరకం అనుభవించారు. మొత్తం గ్రౌండ్ ప్లోర్ అంతా కూడా మునిగిపోయింది. సీఎం చంద్రబాబు చలించిపోయారు. వెంటనే కలెక్టరేట్‌కు చేరుకుని బస్సులోనే ఉంటూ అధికారులకు దిశానిర్ధేశం చేశారని గుర్తు చేశారు. ఆ సాయంపై కూడా పచ్చ కామెర్లు వారిలా మాట్లాడుతున్న వైసీపీ వారికి సిగ్గు అనిపించట్లేదా..? అని మండిపడ్డారు.
నాలుగు, ఐదు రోజుల తరువాత గాల్లో వచ్చి, ఒక పది నిమిషాలు ఆ నీటిలో నడిచి వెళ్లిపోయిన సైకో జగన్ రెడ్డి కూడా నీతులు చెప్పే స్థితిలో ఉన్నరంటే.. ఆశ్చర్యంగా ఉందన్నారు. కోటి రూపాయలు ఇస్తామన్నారు… ఎక్కడ ఇచ్చారు అసలు..? ప్రజలు ఎంత నష్టాపోయారో తెలుసా మీకు..? మేం ఎంత ఇచ్చామో మీకు తెలుసా..? రాష్ట్ర ఖజానాను మీరంతా పూర్తిగా తీనేసి పెద్ద కన్నం పెట్టేసి వెళ్లిపోయారు. అటువంటి పరిస్థితిలో కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్తోంది ఈ ప్రభుత్వం… ఎన్ని వాటర్ బాటిళ్లు ఇచ్చామో మీకు తెలుసా..? ఎన్ని పాల ప్యాకెట్లు ఇచ్చామో మీకు తెలుసా..? ఎన్ని లక్షల ఆహార పొట్లాలు ఇచ్చామో తెలుసా మీకు..? ఇవన్నీ కంటే వారిని ఓదర్చేందుకు బురదల్లోకి వెళ్లి వారికి ధైర్యం చెప్పిన సీఎం చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత మీకు లేదని వారు అన్నారు. రూ.7600 కోట్ల నష్టం జరిగితే మేం నేరుగా 4 లక్షల మందికి రూ.602 కోట్లు ప్రజల ఖాతాల్లో వేశాం. గ్రౌండ్ ప్లోర్ ఉన్న వారికి రూ.25,000లు మొదటి అంతస్తులో ఉన్నవారికి రూ.10,000లు, కనీవినీ ఎరుగని రీతిలో హెక్టార్‌కు రూ.25,000లు పంట నష్ట పరిహారం పంపిణీ చేశామని తెలిపారు.
చంద్రబాబు ఢిల్లీ పర్యటన చేసి, ఒకే రోజు ఐదుగురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రంలో ఉన్న సమస్యలు వివరించారు. ప్రతిసారి జైలుకు వెళ్లకుండా బెయిల్ కోసం ఒంటరిగా కాళ్లు పట్టుకునేందుకు వెళ్లిన సైకో జగన్ గొప్పా..? చంద్రబాబు గొప్పా? మీరే తెలుసుకోండన్నారు. మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి మాట్లాడుతూ అనుభవం ఉన్న నాయకుడు సీఎం చంద్రబాబు అని, స్వయంగా ప్రజల సమస్యలను తెలుసుకునేందుకే గ్రీవెన్స్‌ను ఏర్పాటు చేశారని తెలిపారు. అధికారంలో ఉన్నప్పుడే న్యాయం చేయాలనే ధ్యేయంతో పని చేస్తున్నారన్నారు. ఆకలి తెలిసిన వ్యక్తి చంద్రబాబు అని… అందుకే వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన అన్న క్యాంటీన్లను మళ్లీ మొదలు పెట్టి పేదలకు మూడు పూటలా కడుపు నింపుతున్నారని చెప్పారు. ఈ ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. తిరుమలలో సైతం కొత్తగా మరో వంటశాలను ప్రారంభించారు. 50 నుంచి 100 మందికి భోజనాలు కావాలని ఎవరైనా ఫోన్ చేసి చెప్తే అన్ని రకాల భోజనాలు కూడా సిద్ధం చేసి వారి వద్దకే వెళ్లి అందజేస్తారు. అధికారంలో ఉన్నా లేకపోయిన ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రతి రోజు కష్టపడుతున్న వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు.