వైసీపీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో హైదరాబాద్ లో బుధవారం టీడీపీలో చేరారు. ఇక్బాల్ కు కండువా కప్పి చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు.
మహ్మద్ ఇక్బాల్ నేపథ్యం పరిశీలిస్తే ఆసక్తి కలిగిస్తుంది. ఆయన ఓ మాజీ ఐపీఎస్ అధికారి. గతంలో చంద్రబాబుకు ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేశారు. తర్వాత కాలంలో టీడీపీలో చేరారు. అనంతరం వైసీపీలో చేరి ఎమ్మెల్సీ అయ్యారు.
మహ్మద్ ఇక్బాల్ హిందూపురం అసెంబ్లీ టికెట్ ఆశించగా, ఆయనకు నిరాశ తప్పలేదు. హిందూపురం అసెంబ్లీ ఇన్చార్జిగా ఉన్న మహ్మద్ ఇక్బాల్ ను తప్పించడమే కాకుండా, ఆయనకు ఇతర పదవులేవీ కేటాయించలేదు. అప్పటి నుంచి ఇక్బాల్ వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో ఇటీవల వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మళ్లీ ఇన్నాళ్లకు సొంతగూడు టీడీపీకి తిరిగొచ్చారు.