బీజేపీలోకి వైసీపీ ఎంపీలు

సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే

విజయవాడ,మహానాడు: ఏపీ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీలు అంతా బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, పార్టీ హైకమాండ్ తో మిథున్ రెడ్డి మాట్లాడుతున్నారని వెల్లడించారు. బీజేపీ పెద్దలు ఒప్పుకుంటే అవినాశ్ రెడ్డి మినహా మిగితా ఎంపీలు కాషాయ కండువా కప్పుకుంటారని అన్నారు.