గుంటూరు, మహానాడు న్యూస్:వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ల విషయంలో వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నాయకులు రాష్ట్రంలో రాజకీయాలు చేసి లబ్ధిపొందాలని చూస్తున్నారని గుంటూరు పశ్చిమ టీడీపీ అభ్యర్థి గళ్లా మాధవి విమర్శించారు. గురువారం జిల్లా టీడీపీ కార్యాలయంలో మీడి యా సమావేశంలో ఆమె మాట్లాడారు. సచివాలయ సిబ్బందితో పెన్షన్లు ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటని ఆమె ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి రాగానే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలో టీడీపీ ప్రచారం జోరుగా సాగు తోందని, ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో గుంటూరు పశ్చిమ టీడీపి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
గుంటూరు పశ్చిమలో జోరుగా ప్రచారం
గుంటూరు పశ్చిమ అభ్యర్థి గళ్లా మాధవి గురువారం 30వ డివిజన్ బోరింగ్ పంపు సెంటర్ ఏటి అగ్రహారం 7వ లైన్, ఎస్బీఐ బ్యాంకు దగ్గర నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహిం చారు. సూపర్ సిక్స్ పథకాలపై ప్రజలకు వివరించారు. గత ఐదేళ్లుగా రాష్ట్ర అభివృద్ధి నిలిచిపోయిందని.. నిత్యావసర సరకుల ధరలు, విద్యుత్తు ఛార్జీలు పెరిగాయన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి నెలా రూ.4 వేలు పింఛను ఇంటికే అందజేస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చి సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించా రు. ఈ కార్యక్రమంలో టీడీపీ జోన్ 5 ఇన్‌చార్జి కోవెలమూడి రవీంద్ర, జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరావు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, బీజేపీ ముఖ్య నేతలు, కార్పొరేటర్లు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.